మీరు అధైర్యపడవద్దు..వచ్చేది టిడిపి ప్రభుత్వమే : మాండ్ర
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఈనెల 13న జరిగే ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య అఖండ మెజారిటీతో ప్రజల ఆశీస్సులతో గెలుపొందడం ఖాయమని నంద్యాల టిడిపి పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం మిడుతూరు మండలంలోని తిమ్మాపురం బైరాపురం వీపనగండ్ల గ్రామాల్లో మాండ్ర శివానందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.మీరు ఎవ్వరూ కూడా అధైర్యపడవద్దని వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని అన్నారు.ఈ గ్రామాల్లో ఆయనకు ఘన స్వాగతం పలికారు నాయకులు..ఈ గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ టిడిపి ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరి ఆశీస్సులు కావాలని అందుకు గాను మహిళలు యువకులు ప్రజలందరూ మీ పవిత్రమైన ఓటు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, మండల నాయకులు వంగాల శివరామిరెడ్డి,నందికొట్కూరు కౌన్సిలర్ జాకీర్,చెరుకుచెర్ల రఘురామయ్య,మొల్ల చాకర్ వలి,మనోహర్ రెడ్డి వెంగల్ రెడ్డి మరియు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.