రోడ్లు వేయాలని మంత్రికి టిడీపీ నేతల వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ని తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎడమ కంటి రామేశ్వర్ రెడ్డి,మీనిగ మహేష్ రెడ్డి,బూత్ కన్వీనర్ వెంకటేశ్వర రెడ్డి మంత్రిని బనగానపల్లె లో ఆయన స్వగృహంలో మంగళవారం మ 2 గం.కు మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేసి మంత్రి అయిన శుభ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మండలంలోని పలు సమస్యల గురించి ముఖ్యంగా మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లాలంటే రోడ్లు సరిగ్గా లేవని రోడ్లు వేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా రోడ్లు వేయించడానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.