విద్యాభివృద్దే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలి
1 min readపత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ సూచన
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: విద్యాభివృద్ధి లక్ష్యంగా ఉపాధ్యాయులు అకుంఠిత దీక్షతో పనిచేయాలని పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాం కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. పాఠశాలలో విద్యాబోధన ఎలా ఉందని విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పించిందని అన్నారు.బాలికలతో ఎమ్మెల్యే ముచ్చటించి విద్యాబోధన, మౌలిక సదుపాయాలు, ఆహార నాణ్యత, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలికల విద్యను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే ఉపాధ్యాయ బృందాన్ని కోరారు. పదవ తరగతిలో బాలికలు మంచి మార్కులతో పాసై పత్తికొండ పేరు నిలపాలని సూచించారు. బాలికలు పాఠశాలలో కూర్చోవడానికి బెంచీలు లేవని, ఎమ్మెల్యే దృష్టికి హెడ్మాస్టర్ భ్రమరాంబ తీసుకురాగా, త్వరలోనే పాఠశాలలోని బాలికలకు బెంచీల్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.అనంతరం జనవరి ఒకటో తేదీ న్యూ ఇయర్ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన పత్తికొండ నియోజకవర్గం ప్రజలు అభిమానులు తీసుకువచ్చిన నోటు పుస్తకాలు పెన్నులను, 8, 9, 10వ తరగతి చదువుతున్న 700 మంది విద్యార్థినీలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.