పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తో ఉపాధ్యాయ సంఘాల సమావేశం: ఆప్టా
1 min readపల్లెవెలుగు వెబ్ మంగళగిరి అమరావతి : ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ ల కు శాశ్వత చట్టం చేయాలనే తలపుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారి అధ్యక్షతన ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాల నేతల తో విద్యా భవన్ మంగళగిరి లో జరిగింది .ఈ సమావేశానికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ రామ రాజు గారితో పాటు ఎస్ సి ఇ ఆర్ టి డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (అడ్మిన్) పార్వతి, ఎ పి ఆర్ ఈ ఐ సెక్రటరీ నరసింహారావు, పాఠ్య పుస్తకాలముద్రణ డైరెక్టర్ రవీంద్రనాద్ రెడ్డి, కె జి బి వి సెక్రటరీ మధుసూదనరావు,సమగ్ర శిక్ష రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డి,ప్రభుత్వం పక్షాన పాల్గొని రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల బదిలీలు,ప్రమోషన్ లు ఏవిధంగా జరపాలని దీనికోసం ఒక ప్రత్యేక చట్టాన్ని చేయడానికై ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘ నాయకుల అభిప్రాయాలను సంఘాల వారీగా అడిగి తెలుసుకుని మంచి చెడులను చర్చించారు, అన్ని సంఘాల అభిప్రాయాలను లిఖితపూర్వకముగా తీసుకొని అన్నిటిని క్రోడీకరించి ఒక డ్రాఫ్ట్ తయారుచేసి మరలా చర్చించి దానికి చట్టబద్ధత కల్పిస్తామని కమిషనర్ వారు తెలియజేశారు, ఈ సమావేశానికి ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఎ జి ఎస్ గణపతి రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు హాజరై ప్రాథమిక ఉపాధ్యాయుల పక్షాన వారి అభిప్రాయాలను తెలియజేశారు. ప్రతి సంవత్సరం మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు తప్పనిసరిగా చేయాలని తదనంతరం ఉన్న ఖాళీలకు డీఎస్సీ ప్రకటించాలని కోరారు గత ఆరు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి డిఎస్సి నిర్వహించినందున కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇంకో ఐదు సంవత్సరాల వయోపరిమితిని కల్పించాలని ఆప్టా అధ్యక్షుడు గణపతి రావు కోరారు. గత కొంతకాలంగా మున్సిపల్ ఉపాధ్యాయులకు ఏ విధమైన ప్రమోషన్లు లేనందున తక్షణమే వారికి బదిలీలు ప్రమోషన్లను కల్పించాలని కమిషనర్ వారికి ఆప్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు గారు విన్నవించారు ఈ సమావేశానికి యుటిఎఫ్ ,ఎస్ టి యు ,పి ఆర్ టి యు, ఏపీటీఎఫ్ 1938, ఏపీటీఎఫ్ 257, హెచ్ఎం అసోసియేషన్ ,ఆపస్, వైఎస్ వైఎస్సార్టిఎఫ్ సంఘాల నాయకులు పాల్గొని బదిలీలు ప్రమోషన్ల పై వారి వారి అభిప్రాయాలను తెలియజేసి లిఖితపూర్వకంగా అందజేశారు . వచ్చే శుక్రవారం విద్యా శాఖ లో వున్న కోర్టు కేసు ల విషయం పై సంఘాల తో చర్చ వుంటుందని కమిషనర్ విజయరామరాజు తెలియజేశారు.