విద్యార్థుల అభ్యసనకు నూతన వరవడిలో బోధన
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా ఎఫ్ ఎల్ ఎన్ ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బి తాండ్రపాడు నందు జరుగుతుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు 1, 2 తరగతుల విద్యార్థులకు బోధించే అంశాలు నూతన ఒరవడిలో బోధించడానికి ఈ శిక్షణా కార్యక్రమాలు ఉపయోగపడతాయని, అలాగే ఉపాధ్యాయులు ఒకరి అనుభవాలు ఒకరితో పంచుకోవడానికి, రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాల పై సానుకూల ధోరణి కలిగి ఉండాలని ,ఆరు రోజుల FLN శిక్షణా కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకులుగా విచ్చేసిన శ్రీమతి G. అపర్ణ గారు (సమగ్ర శిక్ష) వివరించడం జరిగింది . ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా TLM మేళాను సందర్శించి, ఉపాధ్యాయులు తయారుచేసిన TLM ను అభినందించారు . ఈ కార్యక్రమంలో కోర్స్ కోఆర్డీ నేటర్లు రమేష్ డైట్ లెక్చరర్ మాట్లాడుతూ ఈ శిక్షణా పాఠశాల ల్లో అమలు చేసే బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉన్నదన్నారు , ఏ ఎం ఓ. డాక్టర్ షేక్ రఫీ మాట్లాడుతూ మండల ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు భాష గణితంలో పునాది బలంగా ఉంటేనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ప్రథమ కోఆర్డినేటర్ దావీదు, కేఆర్పీలు, డిఆర్పీలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.