బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్లు..
1 min readమిడుతూరు తహసిల్దారుగా టి.శ్రీనివాసులు.. నందికొట్కూరు తహసిల్దార్ గా బి.శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులకు జిల్లా నుండి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లి ఎన్నికల అనంతరం ప్రభుత్వం సొంత జిల్లాలకు తహసిల్దార్లను బదిలీ చేసింది.శనివారం రాత్రి తహసిల్దార్లకు మండలాలకు స్థానాలు కేటాయిస్తూ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.సోమవారం మధ్యాహ్నం నందికొట్కూరు తహసిల్దార్ గా నియమితులైన బాయికాటి శ్రీనివాసులు తహసిల్దార్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.ఈయన ఎన్నికలకు ముందు నంద్యాల తహసిల్దార్ గా పనిచేస్తూ ఎన్నికల విధులకు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలానికి బదిలీపై వెళ్లారు. అక్కడి నుంచి నందికొట్కూరు కు బదిలీపై వచ్చారు.మిడుతూరు తహసిల్దార్ గా టి శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు.ఈయన ఎన్నికలకు ముందు గడివేముల తహసిల్దార్ గా పని చేస్తూ ఎన్నికల విధులకు చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి బదిలీపై వెళ్ళారు. అక్కడ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. తహసిల్దార్లకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేశారు. మిడుతూరు తహసిల్దార్ టి శ్రీనివాసులను టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, డిప్యూటీ తహసిల్దార్ షాన్వాజ్,మండల సర్వేయర్ కృష్ణుడు,రీ సర్వే డీటీ సుప్రియ,ఆర్ఐ బాష సీనియర్ అసిస్టెంట్ రాంభూపాల్ రెడ్డి, విఆర్వోలు వెంకటయ్య మరియు సిబ్బంది కలిసి పుష్ప గుచ్చం అందజేశారు.పగిడ్యాల కు ఎం శివరాముడు,కొత్తపల్లి కి కు జి ఉమారాణి,జూపాడు బంగ్లాకు వి చంద్రశేఖర్ నాయక్ తహసిల్దార్లుగా నియమితులు అయ్యారు.