ఆంగ్ల నూతన సంవత్సర సంబరాల్లో తెలుగు తమ్ముళ్లు
1 min readతమ్ముళ్ల తో కోలహాలంగా మారిన తిక్కారెడ్డి నివాసం
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఎమ్మిగనూరు లో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లతో కోళాహాలంగా మారింది. బారీ ఎత్తున నూతన సంవత్సర వేడుకల సంబరాలను కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి కి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి కి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి కి మంత్రాలయం నియోజకవర్గం నాలుగు మండలాల్లోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రాలయం మండలం నుంచి మండల కన్వీనర్ పన్నాగ వెంకటేశప్ప స్వామి, ఎస్ఐ పరమేష్ నాయక్ , క్లస్టర్ ఇన్ ఛార్జ్ లు యల్లారెడ్డి, , బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి , బిసి జనరల్ సెక్రటరీ వట్టేప్ప నరసింహులు , మీడియా కోఆర్డినేటర్ విజయరామిరెడ్డి , కౌతాళం మండలం టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చేన్నబసప్ప అధ్వర్యంలో అన్ని గ్రామాలు నాయకులు కార్యకర్తలు హాజరై శాలువాలు కప్పి పూలమాలలు వేసి, మిఠాయిలు పంచుతూ, సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ నాయకులు హండే హనుమంతు , ఏబు , చిన్నభీమ , చిన్న సుంకప్ప, సంత మార్కెట్ పాఠశాల ఛైర్మెన్ సున్నం గురురాజ, సున్నం రామకృష్ణ , వనికే నాగరాజు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.