ఆర్యవైశ్యులకు గుర్తింపు నిచ్చిన పార్టీ తెలుగుదేశంపార్టీ
1 min read– రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర
పల్లెవెలుగు వెబ్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పిస్తూ ఏపీ స్టేట్ ఆర్యవైశ్య కార్పోరేషన్ లో నన్ను (నంద్యాల నాగేంద్ర)ను డైరెక్టర్ గా నియమించినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి, విద్యా శాఖామంత్రివర్యులు శ్రీ నారా లోకేశ్ కి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టి.జి.భరత్ కి, కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు శ్రీ పాలకుర్తి తిక్కా రెడ్డి కి, తెలుగుదేశంపార్టీ రాష్త్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లుకి కృతఘ్నతలు తెలియజేశారు. ఈ సంధర్బంగా నంద్యాల నాగేంద్ర మాట్లాడుతూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పటి సి.ఎం, పులివెందుల ఎం.ఎల్.ఏ జగన్ మోహన్ రెడ్డి ఆర్యవైశ్యులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, అలాంటి కష్ట కాలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు, రాష్ట్ర వైశ్య కార్పోరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మరియు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రతి జిల్లా తిరిగి చంద్రబాబు నాయుడు తమకు అండగా ఉంటారనే నమ్మకం ఆర్యవైశ్యుల్లో కల్పించారని, వారంతా శ్రీ నారా చంద్రబాబు పై నమ్మకంతో వారైతేనే మాకు మరియు మా వ్యాపారలకు రక్షణ కల్పిస్తారనే ధృడ నిశ్చయంతో పార్టీ గెలుపుకు ఎంతో కృషి చేశారని అన్నారు.