తెలుగు కల్పవల్లి శతకం పుస్తక ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కవి విమర్శకులు కళాపోషకులు కమలా కళానికేతన్ సాహితీ సంస్థ వ్యవస్థాపకులు సవ్వప్ప ఈరన్న రచించిన తెలుగు కల్పవల్లి శతకం పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం పత్తికొండ స్థానిక శాఖ గ్రంథాలయంలో అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్య నారాయణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా పుస్తకావిష్కరణ సభ సాహితీ ప్రియులు పుల్లయ్య యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేయగా, కాసింశెట్టిపుస్తకాన్ని. ఆవిష్కరించారు. వేంకటేశ్వర యాదవ పుస్తకాన్నిసమీక్షించారు , ఈ సందర్భంగా కొత్తపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, సవ్వప్ప ఈరన్న తెలుగు భాష పరిరక్షణకు చేస్తున్న కృషిని, వారి సాహితీ సేవను కొనియాడారు.ఆయన సాహితీ సేవ 1978 లో” సంఘజీవి శతకం” తో ప్రారంభించి నేటికీ సాహితీ ప్రయాణం కొనసాగించడం అంటే సామాన్యమైన విషయం కాదన్నారు.వారు నిజంగా అభినందనీయులని అన్నారు.వారి సాహితీ సేవను ప్రభుత్వం గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.ప్రభుత్వం ఇలాంటి రచయితలను ఆదరించి ఆదుకోవాలని అన్నారు. పుస్తకావిష్కణ అనంతరం అధితులను ఘనంగా సత్కరించారు.ఈ సభలో రంగన్న ,కాశీ విశ్వనాథ, మొదలగు వారు పాల్గొన్నారు.