PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా తెలుగు భాష దినోత్సవ వేడుకలు

1 min read

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు 

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని జి పుల్లారెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో మరియు గౌతమ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో గురువారం తెలుగు భాషా దినోత్సవ, జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల అకాడమీ డైరెక్టర్ సాయి ప్రణీత్   ముఖ్య అతిథిగా పాల్గొని గిడుగు వెంకట రామమూర్తి, ధ్యాన్చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం తెలుగు భాషా దినోత్సవం  ప్రత్యేకత గురించి విద్యార్థులకు వివరించారు అలాగే జాతీయ క్రీడా దినోత్సవం గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు అనంతరం పాఠశాల హెడ్మాస్టర్ చాంద్ బాషా, శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగు భాష ప్రత్యేకత జాతీయ క్రీడా దినోత్సవం గురించి పలు అంశాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తెలుగు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

About Author