ఘనంగా తెలుగు భాషా దినోత్సవం క్రీడా దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేములలోని శ్రీ రాజ రాజేశ్వరి ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం మరియు క్రీడా దినోత్సవం గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీ ఎం. రామేశ్వర రావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు తెలుగు భాషా దినోత్సవం మరియు క్రీడా దినోత్సవం రెండు ఒకేరోజు కావడం చాలా సంతోషంగా ఉందని. తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ప్రతి ఏటా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటామని. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారిక భాషలో ఉన్న అందాన్ని,విలువనుతెలియజెప్పినమహనీయుడన్నారు. క్రీడలు మరియు ఆటలు మనకు జీవితంలో చాలా విలువైన పాఠాలు మరియు విషయాలను నేర్పుతాయి అని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చేసిన చాలా రకాల విన్యాసాలు అందరి మనసు ఆకట్టుకున్నాయని. తదనంతరం తెలుగు భాష దినోత్సవము మరియు క్రీడా దినోత్సవం సందర్భంగా జరిపిన వ్యాసరచన పోటీలలో, స్పీచ్ లలో, ఆటలలో గెలుపొందిన వారికి ప్రధానోపాధ్యాయుల చేతులు మీదుగా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ యం. రామేశ్వర రావు , A.O శ్రీ యం.బి.యన్ రాఘవేంద్రరావు , పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, క్రీడా ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు.