PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగు,ఉర్దూ,కన్నడ మాద్యమాలు సమాంతరం కొనసాగించాలి

1 min read

నంద్యాల జిల్లా మైనార్టీ మంత్రి ఎన్ఎండి ఫరూక్కు విన్నవించిన ఎంపిపి తనయుడు ఈసా, ఎస్డిపిఐ రాష్ట్ర అధ్యక్షులు అతావుల్లా ఖాన్

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుందలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాద్యమంతో పాటు తెలుగు, ఉర్దూ, కన్నడ మాద్యమాలు సమాంతరం కొనసాగించాలని ఎంపిపి తనయుడు ఈసా, ఎసిపిఐ రాష్ట్ర అధ్యక్షులు అతావుల్లా ఖాన్, వార్డుమెంబర్లు సుభాన్, హమీద్, మైనార్టీ నాయకులు హనీస్, విద్యాకమిటీ మాజీ చైర్మన్ ఇర్ఫాన్లు ఆదివారం నంద్యాల జిల్లా మైనార్టీ మంత్రి ఎన్ఎండి ఫరూకు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇం. మీతో పాటు తెలుగు, కన్నడ, ఉర్దూ మాద్యమాలు కొనసాగించాలని లేకపోతే విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. విద్యార్థుల అనుమతి లేకుండ తల్లిదండ్రులకు సమాచారం లేకుండ పాఠశాలలో విద్యార్థుల యొక్క తరగతి మీడియంలు మార్చడమే కాకుండ ఇప్పుడు తెలుగు, కన్నడ, ఉర్దూ మీడియంలకు ప్రవేశాలు. లేవని అంటున్నారన్నారు. 1-5వ తరగతి వరకు చదివిన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఎలా చదవగలరని ప్రశ్నించారు. దాదాపు 600 మందికి పైగా కన్నడు, ఉర్దూ మీడియంలు చదువుతున్నారని సరైన ఉపాధ్యాయులు లేక విద్యాభోదన లేక బలవంతంగా సిబిఎస్ఈ సిలబస్ రాశారని చదువు రాక విద్యార్థులు పాఠశాలలు మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మైనార్టీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ త్వరలో విద్యా శాఖ మంత్రి లోకేష్ను కలిసి సమస్యను పరిష్కరించి బైఫరేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author