కౌతాళం మండల ప్రజలకు పాదాభివందనం తెలిపిన తెలుగు యువత
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండల కేంద్రమైన పార్టీ ఆఫీసులో కార్యక్రమం నిర్వహించగా ప్రకృతి విపత్తు వలన విజయవాడ చుట్టూ పక్కల ప్రాంతాల వారు గత వారం కురిసిన భారీ వర్షాలకు కొన్ని కుటుంబాల ఆస్తి నష్టం ప్రాణ నష్టం వాటిల్లింది.వారందరికీ ధైర్యం చెపుతూ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ తోడూ అంటూ, అటు అధికారులను,ఇటు పార్టీ శ్రేణులను సేవలో నిమగ్నం చేస్తూ,రాష్ట్ర కష్ట సమయాల్లో ముందుకు నడిపిస్తూ, యథాస్థితికి చేర్చే మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు .ఆయన నిర్ణయాలు ,కష్టం చూసి మేమున్నాం అంటూ ఎన్నో సంఘాలు,రాజకీయ ప్రముఖులు,వ్యాపార వేత్తలు, ఉద్యోగస్థులు మొదలగు సంఘాలు తమకు తోచిన సహాయం అందచేశారు.వరద బాధితులకు.అదే ధ్యేయంతో మంత్రాలయం తెదేపా బాధ్యులు రాఘవేంద్ర రెడ్డి సహకారంతో, సీనియర్ నాయకులు శ్రీ చూడి ఉలిగయ్య ఆదేశాల మేరకు కౌతాళం మండల గ్రామ ప్రజలు నాయకులు స్వచ్ఛందంగా వరద బాధితులకు విరాళాలు. 11,03,141రూ “సేకరించి సిఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందచేశారు.దీనికి కృషి చేసిన కౌతాళం మండల వివిధ గ్రామ ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రాలయం తెదేపా సీనియర్ నాయకులు శ్రీ చూడి ఉలిగయ్య వెంకటాపతి రాజు, సౌద్రి బసవరాజు మరియు యువ నాయకులు సురేష్ నాయుడు .ఈ కార్యక్రమమూలో నీలకంఠ రెడ్డి డా”రాజనంద,కురువ వీరేష్, మూకన్న, కాకం రామంజినేయులు, జనసేనా రామాంజినేయులు,గుండప్పా,శివ చూడి,అమ్ము వలీ, నరసప్ప,లింగెస్, తాయాన్న,నబీ,శ్రీరామ్,నాగరాజు మొదలగు తెదేపా కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగినది.