PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైనేరు శివాలయం పరిసరాలను డంపింగ్ యార్డు గా వాడటం తగదు

1 min read

సంబంధిత అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి తగు చర్యలు చేపట్టాలి

బైనేరు వాగు మీద కూలిన వంతెన పై స్పందించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్.

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జంగారెడ్డి గూడెం బైనేరు వాగు వద్ద ఉన్న శివాలయ పరిసరాలను చెత్త డంపింగ్ యార్డు గా మార్చటం తగదన్నారు. బైనేరు వాగు పై కూలిన R&B వంతెన పై సోషల్ మీడియా లో వచ్చిన పిర్యాదుపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మరియు చింతలపూడి శాసన సభ్యులు రోషన్ కుమార్ స్పందించి జిల్లా కలెక్టర్ కు లేఖ వ్రాసి సంబంధిత అధికారులు ఆ పరిసరాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. జంగారెడ్డిగూడెం నుండి కొవ్వూరు మధ్య బైనేరు వాగు మీదుగా కూలిపోయిన బైనేరు R&B బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కోరారు  మరియు 2019లో మంజూరైన నర్సాపురం నుండి అశ్వారావుపేట వరకు రోడ్డు పనుల్లో చేర్చబడిన ఈ బైనేరు వాగు వంతెన సెంట్రల్ రోడ్ ఫండ్ (CRF గ్రాంట్) నుండి రూ: 4.00 కోట్లతో మంజూరు అయ్యిందని టెండర్ల ఖరారు, విధానపరమైన, సాంకేతిక జాప్యం కారణంగా గ్రౌండింగ్ కాలేదని మరియు ఈ జాప్యం కారణంగా కొత్త ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం రీ-ఎస్టిమేట్ చేయవలసిన అవసరం ఉన్నందు వలన ప్రాజెక్ట్ ఆలస్యమైంది. టెండర్ల ప్రక్రియను మరల త్వరగా పూర్తి చేసి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించాలని ఎంపీ కోరారు. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు తగిన  ఆదేశాలు జారీ చేయవసిందిగా ఎంపీ కలెక్టర్ ను కోరారు.

About Author