PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలి

1 min read

మధ్యాహ్న భోజనం పథకం పునః ప్రారంభించాలి. ఏఐఎస్ఎఫ్ డిమాండ్

ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ సందర్భంగా హోళగుంద మండల కేంద్రం స్థానిక తెరు బజార్ నందు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. తాము చదువుకు ఎక్కడ దూరం అవుతున్నాము అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి  అయిన సీనియర్ విద్యార్థుల దగ్గర నుండి జూనియర్ విద్యార్థులు ఒకరికొకరు పాఠ్యపుస్తకాలు ఒకరి దగ్గర నుండి ఒకరు సహకరించుకుంటున్నారు . కాబట్టి విద్య వ్యవస్థలో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల చదువులకు అనుకూలంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని కోరారు. గత వైయస్సార్సీపి ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడంలో పూర్తిగా విఫలం అయింది వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వమైన తమను బాధను అర్థం చేసుకొని తమకు పాఠ్యపుస్తకాలు అందించాలని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు అని వారు తెలియజేశారు.అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని  మళ్లీ పునః ప్రారంభించాలని పేద బడుగు బలహీన  విద్యార్థుల కడుపునిండా అన్నం పెట్టి విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలని.అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్)గా కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి రాజేష్ ఏఐఎస్ఎఫ్ మండల ఉపాధ్యక్షుడు మల్లయ్య ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

About Author