టి.జి భరత్ ఎమ్మెల్యే అవ్వబోతున్నారు.. శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఏ షరీఫ్
1 min readవైసీపీని వీడి టిడిపిలో చేరిన బండిమెట్ట యువకులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ రానున్న ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అవ్వబోతున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఏ షరీఫ్ అన్నారు. టి.జి భరత్ కార్యాలయంలో బండిమెట్ట ప్రాంతానికి చెందిన యువకులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్, టి.జి భరత్‌లు యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం షరీఫ్ మాట్లాడుతూ వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, అందుకే 4 శాతం రిజర్వేషన్లు తీసేస్తారని బీజేపీని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోందని మండిపడ్డారు. 4 శాతం రిజర్వేషన్ల గురించి ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు. తాము రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. ఏపీ 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. రాష్ట్రానికి ఆదాయం రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తారని తెలిపారు. ఏపీకి రాజధాని లేదని.. చంద్రబాబు ఉంటే అమరావతి నిర్మాణం పూర్తయ్యేదని పేర్కొన్నారు. 125 నుండి 130 సీట్లతో తాము గెలవబోతున్నట్లు షరీఫ్ చెప్పారు. కర్నూల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారని.. టిడిపిలో చేరిన ప్రతి ఒక్కరూ వీధివీధికి వెళ్లి ప్రజలకు వాస్తవాలు చెప్పి చైతన్యం తీసుకురావాలని సూచించారు. టి.జి భరత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. పార్టీలో చేరిన వారిలో ముజాహిద్, జుబేర్, జిబ్రామ్, తదితరులు ఉన్నారు.