సెల్ ఫోన్ వినోదంతో పాటు విజ్ఞానం అందిస్తుంది.. టీజీ వెంకటేష్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆధునిక యుగంలో సెల్ ఫోన్ విజ్ఞానంతో పాటు వినోదం అందిస్తుందని అయితే ఇదే సమయంలో కొంతమంది యువత పెడదారి పెట్టడానికి అవకాశం కల్పిస్తుందని టీజీ వెంకటేష్ తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక టీజీవి కళాక్షేత్రలు పత్తి ఓబులయ్య రచించిన సెల్లు పురాణం పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకాన్ని పమిడి వెంకటేశ్వర్లకు అంకితం ఇవ్వడం జరిగింది సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి మాట్లాడుతూ రచన అన్ని రంగాల్లో ఉండటం ఆధునికయుగంలో అవసరమన్నారు మనిషి జీవితంలో అత్యవసర వస్తువుగా మారింది అన్నారు రవీంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ జి పుల్లయ్య మాట్లాడుతూ నేటి కాలంలో విద్యా రంగంలో ఎన్నో మార్పులు ఎన్నో చేర్పులు సెల్ ఫోన్ తెచ్చిందన్నారు యువత చేతిలో సెల్ ఒక అలంకారంగ మారిందన్నారు రచయిత పత్తి ఓబులయ్య మాట్లాడుతూ సమస్యల పైన స్పందిస్తూ గతంలో కల్లోలం జీవన గీతం వంటి పుస్తకాలు సమాజానికి అందించి ప్రస్తుతం సెల్ఫోన్ కొంతమంది యువతను విద్యార్థులను పెడదారి పట్టిస్తుందని అందరికీ అర్థమయ్యే రీతిలో తేటగీతలో రచించడం జరిగింది కార్యక్రమంలో సామ్యూల్ మహమ్మద్ మియా బాల వెంకటేశ్వర్లు శ్రీనివాసరెడ్డి సెల్లు పురాణంలోని పద్యాలను చదివి వినిపించారు కార్యక్రమంలో కరిముల్లా బృందం సెల్ఫోన్ లోని వివిధ యాప్లను వాటి వివరాలను శ్రోతలకు వివరించారు శివయ్య లక్ష్మీ కాంతారావు ఆంజనేయులు డాక్టర్ జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.