PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూల్ తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, ప్రముఖులు.రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలను కర్నూల్ నగరంలో ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని సంకల్ బాగ్ లో ఉన్న ఆయన నివాసంతో పాటు హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న ఆయన కార్యాలయం అభిమానులతో క్రిక్కిరిసిపోయింది. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు నేపథ్యంలో నగరంలోని ఆయన నివాసం వద్ద గురువారం తెల్లవారుజాము నుంచి అభిమానుల సందడి మొదలైంది.టీ.జీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకొని రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు, నగర ప్రముఖులు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన సంఘాల ప్రతినిధులు, టిజివీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు సిబ్బంది అధిక సంఖ్యలో తరలివచ్చి ఆయనకు భారీ పూలమాలను వేసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు బర్త్డే కేకులను కట్ చేశారు. కర్నూల్ నగరం తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖులు తరలివచ్చి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ దంపతులను వేద పండితులు ఆశీర్వదించారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారిని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ఆప్యాయంగా పలకరించి అభినందించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కర్నూల్ నగరంలో కులమతాలు రాజకీయాలకు అతీతంగా టీజీవి కుటుంబం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలియజేశారు. కర్నూలు నగరంలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వల్లే జరిగిందని తెలిపారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా పెట్టుకున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆ భగవంతుని ఆశీస్సులతో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

About Author