ఉర్దూ .. కన్నడ మీడియం సమస్య పరిష్కారానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు
1 min readధన్యవాదాలు తెలిపిన ముస్లిం నాయకులు
పల్లెలుగు వెబ్ హొళగుంద : గత పది నెలలు క్రితం ఉర్దూ మరియు కన్నడ మీడియం విద్యార్థులకు అప్పటి ప్రభుత్వం మధ్యతరంగా CBSE సిలబస్ లో విలీనం చేసినందున ఒకటి నుండి ఆరవ తరగతి వరకు కన్నడ మరియు ఉర్దూ మీడియం చదువుకున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని గమనించి ముస్లిం నాయకులు ఉర్దూ సంఘ నాయకులు కన్నడ సంఘ నాయకులు 10 నెలలుగా నిరంతరం పోరాడుతూ విద్యార్థులకు అన్యాయం జరగకూడదని విద్యాధికారులతో ప్రభుత్వ అధికారులతో వివరించి న్యాయం చేయాలని కోరగా పది నెలల కృషి తర్వాత ప్రతిఫలం దొరికిందని ఇందులో కృషిచేసిన వారికి ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది అలాగే నాయకులు మాట్లాడుతూ విద్యా అదికారులకు మీడియా సహోదరులకు కృతజ్ఞతలు తెలిపారు సమస్యను విద్యార్థి తల్లిదండ్రులు మరియు నాయకులు లేవనెత్తినప్పుడల్ల ప్రతిసారి మీడియా సహోదరులు స్పందిస్తూ సహకరించినందుకు తోటి నాయకులకు సహకరించిన ప్రతి ఒక్కరికి అలాగే మైనారిటీ మినిస్టర్ అయిన N M D ఫరూక్ కి కలిసిన వెంటనే స్పందిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు అలాగే మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనయుడు ఈసా ఎం ఇర్ఫాన్ వార్డు మెంబర్లు సుభాన్ అబ్దుల్ రహమాన్ ఉర్దూ స్కూల్ చైర్మన్ బక్షి మాజీ చైర్మన్ ఇర్ఫాన్ ssv షబ్బీర్ హరున్ తదితరులు పాల్గొన్నారు.