ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన వెలుగోడు మండల ప్రజలు
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు నిన్న పదవి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీ పై ఆయన తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు , రూ 4 వేలకు పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్ళపై మొత్తం ఐదు సంతకాలు చేశారు. ఈరోజు వెలుగోడు మండల కేంద్ర పార్టీ కార్యాలయంలో తెదేపా మండల అధ్యక్షులు అన్నారపు శేషి రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది.కార్యక్రమంలో యువత, పెన్షన్ దారులు, రైతులు, దివ్యాంగులు, బీసీ నాయకులు, మహిళలు, మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపి ఆనందం హర్షం చేశారు.కార్యక్రమంలో తెదేపా మండల ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం, పట్టణ అధ్యక్షులు ఖలిలుల్లా ఖాన్, మండ్ల శంకర్ రెడ్డి, ఎల్లాల కృష్ణుడు, పాల శంకర్ రెడ్డి, హిదాయత్ అలీ ఖాన్, మోమిన్ రసూల్, జాకీర్ హుస్సేన్ ,టైలర్ సయ్యద్, అమీర్ హంజా, అమీర్ అలీ ఖాన్, హుస్సేన్ సాహెబ్, బియ్యం ముర్తుజ, జె.ఇంతియాజ్, సూర్యనారాయణ,వెంకటేశ్వర్ల,ధూపం రమణ, మజీద్ ఖాన్, తెలుగు రమణ, ఆసర్ వజీర్, రామానాయుడు, ఎల్లాల అశోక్, శ్రీనివాసులు, నడిపి స్వామన్న, కార్పెంటర్ బాషా, శ్రీనివాసరెడ్డి, పఠాన్, అశోక్, ఖాజా జనసేన నాయకులు శాలు బాషా తదితరులు పాల్గొన్నారు.