శనివారం పేట బ్రిడ్జి నిర్మాణంపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
1 min readఎమ్మెల్యే బడేటి చంటి ని కలిసి బొకే అందించి అభినందించారు
ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి
15 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొల్లేరు.తమ్మిలేరు అధికార సమీక్ష నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఏలూరు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,తమ్మిలేరు నది పై ఏలూరు అమీనా పేట వద్ద కాజ్ వే పై ప్రతి వర్షా కాలం లో తమ్మిలేరు పొంగినప్పుడు కాజ్ వే ని మూసి వేయడం వలన శ్రీరామ్ నగర్.శనివారపు పేట. దుగ్గిరాల ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే చంటి వివరించటం. ఎన్నికల సమయంలో ప్రజల కి ఇచ్చిన హామీ ని నెరవేర్చే క్రమంలోముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి అత్యవసరం గా కాజ్ వే కి బదులు గా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి సుమారు 15 కోట్ల రూపాయలు అవసరం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకెళ్లిన ఎమ్మెల్యే బడేటి చంటి కి ఏలూరులో పలు గ్రామాల ప్రాంతాల ప్రజలు, వాహనదారులు నగరవాసులు రుణపడి ఉన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)కి వెంటనే ముఖ్యమంత్రి 15 కోట్ల రూపాయలను తక్షణమే మంజూరు చేసి టెండర్లు పిలచి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఏపీ ఎన్జీవోస్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి కృషి చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆయన చాంబర్లో ప్రత్యేకంగా కలిసి పూలబొకే అందించి కృతజ్ఞతలు తెలిపారు.