PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వ అధినేతకు ధన్యవాదాలు : ఆప్తా

1 min read

పల్లెవెలుగు వెబ్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించమని గత ఐదు సంవత్సరాల్లో చేసిన ఉద్యమాలకు గత ప్రభుత్వం కనీస విలువలు ఇవ్వకుండా మరియు తను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను పదవిలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ ఇస్తానని వాగ్దానము చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మాట తప్పి ఉద్యోగులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తూ మీడియా ముందు మాత్రం తాను తన మంత్రివర్గ సహచరులు మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని కపటనాటకాలాడారు కానీ నేడున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు ఉద్యోగులకు ఇబ్బంది కలుగుతుందనే విషయం పత్రికల ద్వారా లేదా ప్రత్యక్షంగా తెలిసిన వెంటనే వాటిపై తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చేస్తున్నందుకు వారికి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అని ఆప్తా రాష్ట్ర అధ్యక్షుడు ఏ జి ఎస్ గణపతి రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రకాష్ రావు పత్రిక ముఖంగా తెలియజేశారు నిజమైన ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడ ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్మానవ వనరుల శాఖామంత్రి శ్రీ లోకేష్ బాబు నిరూపించుకున్నారని వారు కొనియాడారు గత ప్రభుత్వం తీసుకువచ్చిన జిపిఎస్ విధానము గెజిట్ విడుదల చేసిన వెంటనే రాష్ట్ర యావత్తు ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు పత్రికల్లో వ్యక్తపరిచిన వారి ఆందోళనలు మరియు ప్రత్యక్షంగా వారిని కలిసిన వారి ఆందోళనలు పరిగణలోకి తీసుకొని తక్షణమే ఆ జీవోను నిలుపుదల చేస్తున్నామని ప్రకటించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుకి ఆప్తా సంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అలాగే గతవారం సర్వ శిక్ష ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు అందలేక ఇబ్బంది పడుతున్నారని వారికి తక్షణమే జీతాలు చెల్లించాలని మనవి చేసుకుంటూ పంపించిన  ఆప్తా లేఖను పరిగణలోకి తీసుకుని వారి రెండు నెలల జీతాలు ఈరోజు చెల్లించినందుకు గాను మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు కి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ జి ఎస్ గణపతి రావు కే ప్రకాష్ రావు పత్రికాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ఈ రెండు సంఘటనలతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో కూటమి ప్రభుత్వ విధానాలు పట్ల విశ్వాసం కలిగిందని ఎన్నికల ముందు వారు ఉద్యోగులకు చేసిన వాగ్దానాలు నెరవేరుస్తారని పరిపూర్ణ విశ్వాసం కలిగిందని వారు తెలియజేశారు.

About Author