PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి సీఎం, డిప్యూటి సీఎం కు కృతజ్ఞతలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రభుత్వ విద్యార్థుల మధ్యాహ్న భోజనం పథకము కు మహనీయురాలు డొక్కా సీతమ్మ పేరు పెట్టడం పట్ల కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం కమిటీ ప్రభుత్వం నకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, ఐటీ శాఖ మంత్రులు లోకేష్ కి, పరిశ్రమ శాఖ మంత్రి  టీజీ భరత్ కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వము ఈ విధంగా పథకాలకు మహనీయల పేర్లు పెట్టడం శుభ పరిణామం అని కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కళ్ళే. చంద్ర శేఖర్ శర్మ కొనియాడారు. ఈ కార్యక్రమం లో  కార్యదర్శి హెచ్ కె రాజశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య కోశాధికారి హెచ్ కె మనోహర రావు, ఇస్కాల సురేష్ , కేజీ ప్రభాకర్ రావు, సుదర్శన రావు, s.దుర్గాప్రసాద్, శ్రీనాథ్  తదితరులు పాల్గొన్నారు.

About Author