PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు…

1 min read

31 న వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారపూర్వకంగా నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మానిఫెస్టో లో పెట్టాలని కోరగా ఆ నాడు లోకేష్  చంద్రబాబు నాయుడు నిఅదే విధంగా పవన్ కళ్యాణ్ ని ఒప్పించి మానిఫెస్టో లో ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. మానిఫెస్టో లో పెట్టడంతోపాటు ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ‘మాఘ శుద్ధ విదియ ‘ తిథి నాడు నిర్వహించాలని జీవో నెంబర్ 181 ని విడుదల చేసింది ఎన్డీయే ప్రభుత్వం. ఆర్యవైశ్య ఇలవేల్పు శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఆర్యవైశ్యులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు  తెలిపారు. నాడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నామని చంద్రబాబునాయుడు  తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఆర్య వైశ్యులు అందరూ స్వాగతిస్తూన్నారు.నంద్యాల నాగేంద్రఏపీ ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్రాష్ట్ర పార్టీ కార్యదర్శి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *