శ్రీ తాళపాకఅన్నమాచార్యుల 12 వ తరం వారసులు ప్రత్యేక పూజలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీమాన్ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 12వ తరం హరి నారాయణ చార్యులు తాళ్లపాక స్వామీజీ.ఆదివారం శ్రీ మహానందీశ్వర స్వామి వారిని కామేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి మీద కోదండరామస్వామి వారి మీద సంకీర్తనలు పాడి స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారు అలాగే ఆర్ఎస్ గాజులపల్లి లోని మరకత లింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామి మీద కీర్తనలు పాడారు అనంతరము వేద పండితులు శాంతిరాం బట్టు వేద ఆశీర్వచనం చేసి స్వామి శేష వస్త్రం తో పాటు ప్రసాదాన్ని అందజేశారు ఈయన తిరుమల శ్రీవారి ఆలయం సంకీర్తన కైంకర్య పరులుగా సేవలందిస్తారు నిత్యము సుప్రభాత సేవలో నాలుగు సంకీర్తనలు మధ్యాహ్నం నందు స్వామివారి నిత్య కళ్యాణోత్సవంలో కన్యాదాతగా వ్యవహరిస్తూ రాత్రి ఏకాంత మరియు పవళింపు సేవలో గానం చేస్తూ స్వామివారి సేవలో పాల్గొంటూ ఉంటారు. స్వామీజీ వెంట కర్నూల్ శ్రీ వెంకటమాచార్య అన్నమాచార్య సేవ ట్రస్ట్ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి, ఆర్గనైజర్ శ్రీమాన్ శ్రీ శ్రీ గుబ్బ వెంకటరమణ మరియు శ్రీమాన్ శ్రీ శ్రీ యుగంధర్ శెట్టి పాల్గొన్నారు.