ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్య కు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి ..
1 min readకర్నూలు జిల్లా కురువ సంఘము..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్ల ఆలూరు మండలం ఆరికెర ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం కొన్ని రోజులుగా గ్రామంలో వివాదం జరిగింది.ఫీల్డ్ అసిస్టెంట్ కురువ బండారి ఈరన్నని దారుణంగా హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న, కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కే. రంగస్వామి సహాయ కార్యదర్శి కొత్తపల్లి దేవేంద్ర డిమాండ్ చేశారు. ఉపాధిహామీ పనులు చేయించేందుకు వెళుతుండగా వేటకొడవలితో హత్యకు పాల్పడిన గుర్తుతెలియని దుండగులు. ఇంత కిరాతకంగా హత్యకు గురైన విషయం తెలుసుకున్న కురువ సంఘం నాయకులుజిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ,బి. వెంకటేశ్వర్లు, కత్తి శంకర్,, కే. టీ. ఉరుకుందు,.జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కే. రంగస్వామి,కోశాధికారి కే. సి. నాగన్న, నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు,కార్యదర్శి బి. రామకృష్ణ, పెద్దపాడు పుల్లన్న, బి. సి. తిరుపాలు ఖండించారు.