అర్జీలు సత్వర పరిష్కారమే లక్ష్యం
1 min readఅర్జీలను నాణ్యతతోపాటు నిర్ధేశిత సమయంలోగా పరిష్కరించాలి
విభిన్న ప్రతిభావంతుల అర్జీలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై వచ్చిన అర్జీలను సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదిక(పిజిఆర్ఎస్) లో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారంకోసం వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా విభిన్న ప్రతిభావంతుల నుండి అర్జీలను స్వీకరించేందుకు వేదిక కిందకు వచ్చి వారి సమస్యలను స్వయంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీరి సమస్యలను నిర్లక్ష్యంచేయకుండా మానవతా ధృక్పదంతో పరిష్కరించాలన్నారు. అర్హత ఉన్న వారికి ప్రభుత్వ పధకాలను అందించేందుకు కృషిచేయాలన్నారు. విభిన్న ప్రతిభావంతులకు వారి వైకల్యాన్ని గుర్తించి సదరం ధృవీకరణ పత్రాలను, రేషన్ కార్డు, పెన్షన్ మంజూరుకు ఆయా శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని అందుకు అవసరమైన చర్యలు తీసుకొని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులకు కలెక్టర్ సూచించారు. ఈ సందర్బంగా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన చింతా రవికుమార్ అర్జీనిస్తూ మధుమేహం వ్యాధి మూలంగా తనకాలును తీసివేశారని, కుడికాలుకు సంబంధించి సమస్యవుందని, సదరం ధృవీకరణకూడా పొందానని ప్రస్తుతం ఇస్తున్న రూ. 6వేల పెన్షన్ ను రూ.15 వేలు పెంపుకు చర్యలుతీసుకోవాలని కోరారు. అదే విధంగా ఉంగుటూరు మండలం వెల్లమెల్లికి చెందిన ఉమ్మట్ల నాగమణి అర్జీనిస్తూ ఫించన్ మంజూరు కొరకు నూతన బియ్యంకార్డు మంజూరు చేయాలని కోరారు. సంబంధిత అర్జీలను పరిశీలించిన కలెక్టర్ వాటిపై అవసరమైన చర్యలకోసం సంబంధిత అధికారులను అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు.అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజలు పిజిఆర్ఎస్ లో సమర్పించే అర్జీలపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచి పూర్తిగా తన పరిష్కరించాలన్నారు. స్వీకరించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు విచారణ చేపట్టి సత్కర్ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కార వ్యవస్థలో అందిన ధరఖాస్తులను నిర్ధేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుదారులు విజ్ఞఫ్తులను అధికారులు క్షుణంగా పరిశీలించి రీఓపెనింగ్ లేకుండా చూడాల్సిన భాద్యత అధికారులపై ఉందన్నారు. అందిన అర్జీల్లో మరికొన్నిG కొయ్యలగూడెం మండలం ధర్మారావుపేట కు చెందిన పెనుమత్స శ్రీరామరాజు అర్జీనిస్తూ తన భూమిని దౌర్జన్యంగా తన నుంచి స్వాధీనం చేసుకోవాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని, కావున తన భూమిని సర్వేచేసి ఇప్పించాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం కు చెందిన గండికోట వెంకటేశ్వరరావు అర్జీనీస్తూ తన భూమి ఆన్ లైన్ చేయించాలని కోరారు. కుక్కునూరు మండలం సీతానగరంకు చెందిన కొయ్యల అశోక్ అర్జీనిస్తూ పాస్ బుక్కుల ఆధారంగా తన భూమిని చూపించాలని కోరారు. దెందులూరు మండలం శ్రీరామవరంకు చెందిన బొప్పన శ్రీనివాసరావు అర్జీనిస్తూ గుర్రమ్మకుంట చెరువు ఆక్రమణలకు లోనై రైతులను ఇబ్బిందికి గురిచేస్తున్నారని ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు. లింగపాలెం మండలం రాయుడుపాలెంకు చెందిన వెంపాటి స్వాతి అర్జీనిస్తూ తమ భూమిని కొలిపించి సర్వేచేసి అప్పగించాలని కోరారు. జిల్లా కలెక్టర్ వారితోపాటు పిజిఆర్ఎస్ లో పాల్గొన్న జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు,కె. భాస్కరరావు, దేవికరాణి కూడా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.