నాణ్యమైన విద్య.. భోజనం అందించడమే లక్ష్యం..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): విద్యార్థులకు నాణ్యమైన విద్య మరియు భోజనం అందించడమే ముఖ్య ఉద్దేశమని నంద్యాల జిల్లా మిడుతూరు ఆదర్శ పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ సలీం భాష అన్నారు.ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన భోజనం అందించేందుకు గాను ఇంకా మెరుగైన భోజనాన్ని విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం నూతన మెనూను పాఠశాలలో అమలుపరుస్తున్నామని అన్నారు.మధ్యాహ్న భోజనాన్ని ప్రిన్సిపాల్ పరిశీలించి భోజనానికి శుభ్రంగా ఉండే విధంగా చూడాలని వంట నిర్వాహకులకు ప్రిన్సిపాల్ సూచించారు.పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ప్రత్యేకంగా ఉదయం సాయంత్రం తరగతులు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ అన్నారు.