వరద బాధితులకు చేయూతనందించిన ఆర్యవైశ్య సంఘం
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో సామాజికవేత, మల్లెల గ్రూప్స్ అధినేత, డా. మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు మన మతం మన తత్వం మానవత్వం అనే సిద్ధాంతం తో ” చేయి చేయి కలుపుదాం విజయవాడ ప్రాంతం వరద బాధితులను ఆదుకుందాం ” అనే కార్యక్రమాన్ని ఎమ్మిగనూరు నియోజకవర్గం లో గత ఏడు రోజుల నుండి స్టాల్స్ ఏర్పాటు చేసి నిర్వహిస్తూరావడం జరిగింది.ఈ కార్యక్రమానికి టౌన్ మొదలుకొని అనేక గ్రామాల నుండి కూడా మంచి స్పందన రావడం జరిగింది. చిన్న పెద్ద కులము మతము ప్రాంతము అని తేడా లేకుండా ఎవ్వరికి తోచిన సహాయాన్ని వారు అందించడం జరిగింది.అందులో భాగంగానే ఎమ్మిగనూరు ప్రాంత ఆర్యవైశ్య సంఘం సభ్యులు విజయవాడ ప్రాంతం వరద బాధితుల కోసం లక్ష రూపాయలు విలువ చేసే నిత్యవసర సరుకులు, బట్టలు, బెడ్ సీట్స్ మొదలగు సామాగ్రిని అందించడం జరిగింది.ఈ సందర్భంగా డా. మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజుగారు మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు మీ వంతు సహాయ సహకారాలు అందించమని ఆర్యవైశ్య సంఘ సభ్యులను కోరగా వెంటనే వారు మంచి మనసుతో స్పందించి ఒక్క రోజులోనే లక్ష రూపాయలు విలువచేసే నిత్యవసర సరుకులను మల్లెల గ్రూప్స్ కు అందించడం జరిగింది. వాస్తవానికి వైశ్యాస్ అంటే వ్యాపారం, వ్యాపారం అంటేనే వైశ్యాస్ అనే భావన చాలామంది మనుషుల్లో ఉంటుంది కానీ వైశ్యాస్ అంటే సాటి మనిషి ఆపదలో ఉంటే ఆ మనిషిని ఆదుకునే వ్యక్తులని గత కొన్ని రోజుల క్రిందట కేరళలో సం భవించిన వరదల విషయంలో గాని, చెన్నైలో సంభవించిన వదల విషయంలో గాని, ఆంధ్రప్రదేశ్ లో హుద్ హుద్ తుఫాను సమయంలో గానీ, మంత్రాలయం వరదలు విషయంలో గానీ ఇలా అనేక సందర్భాలలో ఎమ్మిగనూరు ప్రాంత ఆర్యవైశ్య సంఘ సభ్యులు కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే నిత్యవసరకులను వరద బాధితుల కోసం ఆనాడు కూడా అందించడం జరిగింది. ఇప్పుడు కూడా విజయవాడ ప్రాంత వరద బాధితుల కోసం ఎంతో విలువైనటువంటి నిత్యవసర సరుకులను అందించి, వైశ్యాస్ అంటే వ్యాపారస్తులే కాదు, ఆపదలో ఉన్న సాటి మనిషిని ఆదుకునే వ్యక్తులని నిరూపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ సభ్యులను, సంఘ పెద్దలను, ప్రతి ఒక్కరిని అభినందిస్తూ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆర్య వైశ్యుల యొక్క ప్రేమను విజయవాడ వరద బాధితులకు మల్లెల గ్రూప్ ద్వారా అందించే అవకాశం దొరికినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, సెక్రెటరీ ప్రవీణ్, కోశాధికారి నాగ్ కుమార్, మరియు సంఘ సభ్యులు, సోషల్ వర్కర్ గిరి,రఘు,రంగస్వామి,మల్లెల గ్రూప్ సభ్యులు సామెల్, రవి, ముత్తు, అజిత్, సతీష్, హనుమంతు, పవన్, రంజిత్ రెడ్డి, మొదలగు వారు పాల్గొన్నారు.