పోలీసు ముసుగులో జర్నలిస్టు కృష్ణ పై దాడిపై విచారణ జరపాలి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: గత వారం పోలీసు ముసుగులో కృష్ణ పై దాడి హేయమని ఎపిఎంపిఎ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీ రామ్ యాదవ్ అన్నారు. మంగళవారం కొత్తవంతేన దగ్గర కల ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 360 ఛానల్ రాష్ట్ర ఛీఫ్ బ్యూరో మేడా కృష్ణ ,ఆయన కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేసే విధంగా పెనమలూరు ప్రవర్తించిన తీరు హేయమని అన్నారు.కృష్ణ చేశాడని చెప్పబడుతున్న వార్త ఆ ఛానల్ లింక్ ఏవరు పెట్టేరో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.360 ఛానల్ బ్యూరో మేడా కృష్ణపై పోలీసుల తీరు సరికాదన్నారు.ఎమ్మెల్యేకి పరువు నష్టం కలిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలే కాని అర్ధరాత్రులు ఇంటిపై ఆసాంఘిక శక్తులతో కలసి బలవంతంగా దాడి చేయడం సరికాదన్నారు.స్థానిక ప్రజల ప్రతిఘటనతో కృష్ణను వదిలేశారని తెలిపారు.ఆనంతరం హ్యుమన్ రైట్ ఆసోసియోషన్ గుట్టా రోహిత్ మాట్లాడుతూ అర్థరాత్రి ఇళ్ళకు వెళ్ళి భయబ్రాంతులకు గురుచేయడం చట్టవ్యతిరేకమైన చర్య అన్నారు.పెట్టిన కేసుకు వార్తకు సంభంధం లేదన్నారు.వ్యవస్థీకృత నేరం ఏమీ చేరని అన్నారు. పెట్టిన కేసుకు వార్త లింఖుకు సభందం లేదన్నారు. అనంతరం జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం నాయకులు ఎ.వి.వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈవీడియోలు చేసింది ఏవరు? ప్రచురుణ ఏవరు చేశారో విచారణ చేయాలన్నారు.అమాయకుడైన కృష్ణ పై కుట్రపూరిచమైన కేసులు పెట్టడం పిరికిపంద చర్య అన్నారు. అర్ధరాత్రి కృష్ణ ఇంటికి వెళ్ళిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పరువు పోయింది అనుకుంటే కేసు పెట్టే హక్కు ఉంటుంది కాని అర్థరాత్రి కృష్ణ ఇంటికి వెళ్ళిన తీరు గయ్హనీయమని అన్నారు మనం చట్టప్రకారం నడుచుకోవాలన్నారు.ఈసంఘటనపై పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి,యువ నాయకులు లోకేష్ ను,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను,డిజిపిని కలసి న్యాయం కోరతమాని అన్నారు.అర్ధరాత్రి ఒక సాటిలైట్ ఛానల్ స్టేట్ బ్యూరో చీఫ్ మీద మరియు అతని ఇంటిలోని మహిళలు మీద కనీస ఇంగితజ్ఞానం లేకుండా వివక్షపూరిత దాడి చేయడం, బ్యూరో చీఫ్ ను బలవంతంగా కారులో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేయడం అత్యంత హేయమైన చర్య. పోలీసుల పేరుతో అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు ఏ విధమైన ముందస్తు నోటీసు లేకుండా అలా ప్రవర్తించడం చాలా దుర్మార్గం . ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన నాటి నుండి విలేకరులకు ఇస్తున్న ప్రాధాన్యత పాత్రికేయ రంగానికి కొంత భరోసా ఇస్తున్నా కొంతమంది విపరీత దోరణుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక శాటిలైట్ ఛానల్లో యాజమాన్యం అన్ని తానై ఒక కృష్ణాజిల్లా ఎమ్మెల్యే మీద వార్తలు తయారుచేసి టెలికాస్ట్ చేస్తే సదరు వార్తను యాజమాన్యం సలహా మేరకు వివిధ గ్రూపులలో పంపినందుకు స్టేట్ బ్యూరో చీఫ్ ని టార్గెట్ చేసి అర్థరాత్రి అతని నివాసానికి వెళ్లి అత్యంత కాటిన్యంగా కొంతమంది వ్యక్తులు ప్రవర్తించడం దానిపై సదరు స్టేట్ బ్యూరో చీఫ్ తెనాలి పోలీస్ స్టేషన్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయగా కంప్లైంటు తీసుకోవడానికి స్టేషన్ సిబ్బంది నిరాకరించడం కూడా ఒక గిరిజన వ్యక్తిని ఒక శాటిలైట్ ఛానల్లో స్టేట్ బ్యూరో చీఫ్ గా పని చేస్తున్న మేడా కృష్ణను అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేయడమేనని అనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుండి న్యూస్ 360 యాజమాన్యం స్టేట్ బ్యూరో చీఫ్ మేడా కృష్ణా మీద ఒత్తిడి తీసుకువచ్చి సదరు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వార్త తయారు చేయాలని ఆజ్ఞాపించడం అందుకు మేడా కృష్ణా నిరాకరించడంతో కక్షగట్టినట్లు యాజమాన్యమే వార్తను తయారుచేసి టెలికాస్ట్ చేసి స్టేట్ బ్యూరో చీఫ్ మీద రుద్ది సదరు ఎమ్మెల్యే మనుషులతో పెనమలూరు పోలీస్ స్టేషన్ లో కొన్ని సెక్షన్లతో పాటు దేశ భద్రతను విఘాతం కల్పించే విధంగా ఉన్నాడనే సెక్షన్ ని కూడా కలిపి ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం చూస్తుంటే చానల్ యాజమాన్యం గాని సదరు ఎమ్మెల్యే మనుషులు గాని కక్షగట్టినట్లు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మరియు ప్రభుత్వ పెద్దలు కలుగజేసుకొని ఈ విషయంపై కూలంకుషమైన విచారణకు ఆదేశించి నిజా నిజాలు నిగ్గు తేల్చాలి అని పాత్రికేయ ప్రపంచం కోరుకుంటుందన్నారు.ఈ కార్యక్రమంలో అప్పొజి,మేకల కోటేశ్వరరావు,అద్దంకి సునీల్,కారే శ్రీనివాస్, పెద్థ ఎత్తున్న జర్నలిస్టులు,యునియన్ నాయకులు పాల్గొన్నారు.