ఉత్తమ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు !ఆర్డిఓ భరత్ నాయక్
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: సమాజాన్ని కీర్తి రెడ్డి ఉత్తమ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో భరత నాయక్ చేత రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టియు) నూతన సంవత్సర 2025 దినచర్య పుస్తకాన్ని, క్యాలెండర్ను, మరియు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, ఉత్తమ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులనీ అన్నారు. ఉపాధ్యాయులు ఉత్తమ పౌరుల్ని తీర్చిదిద్దినప్పుడే ఉత్తమ సమాజం ఏర్పడుతుందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, అలాంటి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత ఉపాధ్యాయ వర్గంపై ఉందన్నారు. ఉపాధ్యాయులు హక్కులతో పాటు బాధ్యతలను కూడా మరవకూడదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు రాష్ట్ర కౌన్సిలర్స్ సత్యనారాయణ, నారాయణ, వీరస్వామి ,జిల్లా ఆర్థిక కార్యదర్శి ఇట్రెడ్డి రామ్మోహన్ రెడ్డి,మండల అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, బలరాముడు, మారుతి, తుగ్గలి మండల నాయకులు సంజీవయ్య మొదలగు వారు పాల్గొన్నారు.