విద్యార్థుల మనసులలో అభిమాన ముద్ర ఉన్న వారే ఉత్తమ ఉపాధ్యాయులు
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : విద్యార్థుల హృదయాల్లో అభిమానంతో చరగని ముద్ర వేసుకున్న వారే ఉత్తమ ఉపాధ్యాయులని ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ సబ్జెక్టు ఉపాద్యాయినీరాలు శ్రీ మతి చంద్రకళావతమ్మ పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సన్మాన సభలో పలువురు మాట్లాడారు. కర్నూలు కు చెందిన శ్రీ మతి చంద్రకళావతమ్మ ఉపాద్యాయ వృత్తి పై మక్కువతో ప్రైవేటు టీచర్ గా పని చేస్తూ ప్రభుత్వం ఉద్యోగిగా కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడలో తొలి సారి ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు చేపట్టిన ఆమే పుణ్యక్షేత్రమెన మంత్రాలయంలో పదవి విరమణ పొందడం ఆమెకు దొరికిన భాగ్యం అన్నారు. సుమారు 26 సంవత్సరాల పాటు విధి నిర్వహణలో ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిందని కొనియాడారు. ఉపాద్యాయ వృత్తిలో ఉంటూ బదిలీ పై వెళ్లే సమయంలో ఎవరైతే విద్యార్థుల కళ్ళల్లో నీళ్ళు చూస్తామో వారు అదృష్టవంతులని అంత దగ్గరగా విద్యార్థుల మనసులో స్థానం సంపాదించుకున్నట్లని తెలిపారు. అనంతరం పదవి విరమణ చేసిన శ్రీమతి చంద్రకళావతమ్మకు ఆమె భర్త కృష్ణ గౌడ్ లకు శాలువలతో పూలమాలలు వేసి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హంపయ్య ఉపాద్యాయులు రామన్న విఠోబా రావు, చంద్రశేఖర్, నాగభూషణం, గోపాల్, బసవరాజు, సత్యనారాయణ, ఈరన్న, హరి, శ్రీనివాసులు, రామకృష్ణ, అనురాధ, సంధ్యారాణి, సువర్ణ, పుష్పలత, ఉమామహేశ్వరి , సుల్తానా తదితరులు పాల్గొన్నారు.