ప్రభువు యేసుక్రీస్తు జన్మించిన రోజు మానవాళికి ఆనందకరమైన రోజు
1 min readశ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మరియు వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పవిత్రమైన క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి నగరంలోని CSI చర్చి, స్టాంటన్ చర్చి, హోసన్నా మందిరం, కోల్స్ సెంటీనియల్ చర్చ్ లలో జరిగిన సామూహిక ప్రార్థన లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి ఏసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడని, ఆయన అందించిన శాంతి సందేశం మానవులలోని దుర్ఘనాలు నశించి మంచి ప్రవర్తన ను అలవర్చు కున్నారని తెలిపారు భారత రాజ్యాంగం సెక్యూలర్ దేశంగా భారత దేశాన్ని రూపొందించింది అని అందరూ అన్ని మతాలను సమద్రుష్టి తో సోదర భావాన్ని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తాను నగరంలోని అన్ని మతాల పండుగలకు హాజరవుతానని అన్ని మతాలలో తనకు అభిమానులు ఉన్నారని ఇవి తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు సామూహిక ప్రార్థనలు విచ్చేసిన క్రైస్తవ సోదరులకు అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.