పేదల కోసమే అన్న క్యాంటీన్..
1 min readపేదల అన్నాన్ని తొలగించిన గత ప్రభుత్వం
గడచిన ఐదేళ్లలో అభివృద్ధి శూన్యం
స్వార్థం కోసమే గత నాయకులు
అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పేద ప్రజల ఆకలిని తీర్చాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేసిందని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో భాగంగా మూడవ విడతలో నందికొట్కూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ ను సోమవారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే జయసూర్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు మున్సిపాలిటీ కమిషనర్ మరియు నాయకులు ఘన స్వాగతం పలికారు.ప్రారంభోత్సవంలో మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ బేబీ,మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మరియు వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో పేదల ఆకలిని తీర్చేందుకు ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని గత వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల భోజనాన్ని తొలగించిందని గత ప్రభుత్వంలో నందికొట్కూరు నియోజకవర్గంలో ఐదేళ్లలో ఎక్కడా కూడా అభివృద్ధి లేదని స్వార్థం కోసమే గత నాయకులు పనిచేశారని ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని తిరిగి చూసే విధంగా ముందుకు వెళ్తున్నామని అంతే కాకుండా ఈ ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.ఎమ్మెల్యే మరియు నాయకులు అధికారులు అన్న క్యాంటీన్ లో టిఫిన్ చేశారు.300 మందికి టిఫిన్ అయ్యే ఖర్చును వైస్ చైర్మన్ రబ్బానీ చెల్లించారు.ఈ కార్యక్రమంలో జనసేన రవికుమార్, కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన్,భాస్కర్ రెడ్డి, చిన్న రాజు,ధర్మారెడ్డి చాంద్ భాష,మందడి వాణి, నాయకులు కాతా రమేష్ రెడ్డి, పలుచాని మహేశ్వర్ రెడ్డి, ముర్తు జావలి, రవీంద్రారెడ్డి,మల్లికార్జున రెడ్డి, లాయర్ జాకీర్ హుస్సేన్, రసూల్ ఖాన్,ఆర్ట్ శీను,తాటిపాటి అయ్యన్న,డాక్టర్ వనజ,మీనాక్షి,రాజన్న తదితరులు పాల్గొన్నారు.
,