బీసీల సంక్షేమంపై ఇచ్చిన మాటకోసం సమీక్షించిన ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎన్నికల ప్రచారంలో బీసీల సంక్షేమంపై ఇచ్చిన మాటకోసం సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన జిల్లా టీడీపీ బీసీ నాయకులు మరియు రాష్ట్ర జాతీయ బీ.సి సంక్షేమ సంఘం నాయకులుబీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధృష్టి పెట్టారని, ఇందులో భాగంగానే బీసీలకు లబ్ధి కలిగించేలా కార్యక్రమాలకు చేపట్టేందుకు చంద్రబాబునాయుడు భావిస్తున్నారని, బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై చంద్రబాబునాయుడు సమీక్ష చేయడం శుభపరిణామమని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వర రావు యాదవ్ గారు పార్టీ నాయకులు తెలుగుదేశంపార్టీ బీ.సి సెల్ పార్లమెంట్ అధ్యక్షులు సత్రం రామక్రిష్ణుడు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ పోతురాజు రవికుమార్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ధరూర్ జేమ్స్, రాష్ట్ర సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చింతమాను సురేంద్ర నాయుడు, జిల్లా బీసీ యూత్ అధ్యక్షులు కిరణ్ గార్లతో కలిసి జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం, కర్నూలు నందు విలేఖరులతో మాట్లాడటం జరిగింది.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ వై.ఎస్ జగన్ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, బీసీలంటే బ్యాక్వార్డు కాదు బ్యాక్ బోన్ అంటూ మాటమాటలు చెప్పి 2019 ఎన్నికల్లో గెలుపొందారని, వై.ఎస్. జగన్ నిర్లక్ష్యం కారణంగానే బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను 24 శాతానికి కుదించి దాదాపు 16 వేల 500 మంది రాజకీయ పదవులకు దూరం అయ్యారని అన్నారు. చంద్రబాబునాయుడు బీసీల రాజకీయ ఎదుగుదలకు గుర్తింపు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగానే బీసీల అభ్యునతి కోసం 34 శాతం రిజర్వేషన్ల సాధనకు సుముఖుత వ్యక్తం చేసినందున వారికి తెలుగుదేశంపార్టీ బీసీల తరపున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.రాష్ట్రంలో ఉన్నటువంటి బీ.సీ సంక్షేమ హాస్టళ్లలో బాలికల హాస్టళ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని సీ.ఎం ఆదేశించారని, గత ప్రభుత్వం పెట్టిన రూ.110 కోట్ల డైట్ బిల్లల బకాయిల్లో ఇప్పటికే రూ. 76.38 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించిందని, ప్రభుత్వం చెల్లించగా పెండింగ్ లో ఉన్న రూ.34.14 కోట్లను త్వరలో చెల్లించాలని సీ.ఎం ఆదే శించారని అలాగే 2024 – 25 సంవత్సర బడ్జెట్ ప్రభుత్వం రూ.135 కోట్లు కే టాయించిందని అన్నారు. స్కిల్ ఎడ్యుకేషన్లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్, సోషల్ ఎమోషనల్ స్కిల్స్, నైతిక విలువలు, నీతి శాస్త్రం, డిజిటల్ లిటరసీ, లీగల్ అవేర్నస్ వంటివి ఎస్.ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్ల ద్వారా విద్యార్ధులకు అందించనున్నారని, 26 జిల్లాలలోని 104 బీసీ హాస్టళ్ళలో పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేయనున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవేంద్ర గౌడ్, వీరేష్, డి.వి. చంద్ర మొదలగు వారు పాల్గొన్నారు.