మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ని ఏక వచనంతో దుర్భాషలాడిన సీఐ వెంటనే క్షమాపణ చెప్పాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: వైయస్ఆర్ సిపి ఎమ్మిగనూరు నియోజవర్గ ఇన్చార్జ్ శ్రీమతి బుట్టా రేణుక గారి ఆదేశాల మేరకు,సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు,ఎమ్మిగనూరు మండల కన్వీనర్ బి ఆర్ బసిరెడ్డి గారు, నియోజకవర్గ పార్టీ శ్రేణులతో కలసి నిన్నటి దినమున సాగునీటి సంఘం ఎలక్షన్లో పార్లపల్లి లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న టిడిపి నాయకులను అడ్డుకోబోయిన మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారిని ఏక వచనముతో దుర్భాషలాడిన సీఐ ఇబ్రహీం వెంటనే క్షమాపణ చెప్పాలని పట్టణంలో సోమప్ప సర్కిల్లో నిరసన,ధర్నా కార్యక్రమాన్ని చెప్పట్టడం జరిగింది.ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు,బిఆర్ బసిరెడ్డి గార్లు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో ఎరోజు కూడా మేము ఎమ్మెల్యే ని కించపరచడం గాని, అవమానించడం గాని జరిగిందా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం లో ఒక ప్రజా నాయకుడిని ఇలా మాట్లాడడం సమంజసం కాదులోకేష్ బాబు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్న పోలీస్ అధికారులను తప్పు పట్టిన వైయస్ఆర్ సిపి శ్రేణులు ఎల్లవేళల కూటమి ప్రభుత్వం ఉండదని పోలీస్ అధికారులను హెచ్చరించిన వైయస్ఆర్ సిపి శ్రేణులు సాగునీటి సంఘం ఎలక్షన్లో ఏకపక్షంగా వ్యవహరించడమే కాకుండా వైయస్ఆర్ సిపి నాయకులను బెదిరించడం సమంజసం కాదని మండిపడ్డారు . ప్రజాస్వామ్యం బద్ధంగా ఎలక్షన్లు జరిగితే కూటమి ప్రభుత్వం ఓడిపోతారు అనే భయంతో పోలీస్ అధికారులు ముందు పెట్టి ఏకపక్షంగా వ్యవహరించడం ఇది ప్రజాస్వామ్యం కాదని అన్నారు.మాజీ ఎమ్మెల్యే కి సిఐ ఇబ్రహీం వెంటనే బేషరతుగా క్షమాపనులు చెప్పాలి లేని పక్షంలో రేపు ఎమ్మిగనూరు బంద్ పిలుపునిస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణం,ఎమ్మిగనూరు మండలం,నందవరం మండలం,గోనెగండ్ల మండలం చైర్మన్లు, వైస్ చైర్మన్లు,జడ్పిటిసిలు,ఎంపిటిసిలు,మండల కన్వీనర్లు,సర్పంచులు, ఆయా మండల, గ్రామాల నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.