పల్లెల్లో అభివృద్ధి అంటే ఏమిటో కూటమి ప్రభుత్వం చూపిస్తోంది
1 min readటిడిపి యువ నాయకులు రామకృష్ణ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: రాష్ట్రంలో లోని పల్లె ల్లో అభివృద్ధి అంటే ఏమిటో కూటమి ప్రభుత్వం చూపిస్తోందని టిడిపి యువ నాయకులు రామకృష్ణ రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలలో భాగంగా మంత్రాలయం మండలంలో చిలకలడోన, కల్లుదేవకుంట గ్రామాల్లో పల్లె పండగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా చిలకలడోన లో రూ 15 లతో మూడు సిసి రోడ్లు, కల్లుదేవకుంట లో రూ 10 లతో రెండు సిసి రోడ్లలకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లె లు అభివృద్ధి చెందాలంటే రోడ్లు ప్రధానంగా ఉండాలన్నారు. అప్పుడే పల్లె లు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గం లో రాఘవేంద్ర రెడ్డి సహయ సహకారాలతో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు అశోక్ రెడ్డి, వరదరాజు, ఎంపీడీఓ శోభరణి , ఏపీవో తిమ్మారెడ్డి , పంచాయితీ రాజ్ ఏఈ మల్లయ్య , టిడిపి నాయకులు అశోక్ రెడ్డి, వరదరాజు, ఎంపిటిసి సభ్యులు మేకల వెంకటేష్, హనుమంతు, తిక్కయ్య, డిసి తిమ్మప్ప, గోపాల్ రెడ్డి, బావిగడ్డ రాఘన్న , కురువ మల్లయ్య, భీమయ్య,నరసింహులు,రాజు, నరసింహులు, శివ, డేవిడ్, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.