అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
1 min readఅంగన్వాడి కేంద్రం లో పిల్లలకు బోధిస్తున్న ఫ్రీ స్కూల్ యాక్టివిటీస్ పరిశీలన
పిల్లలకు సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందించే విధంగా కార్యకలాపాలు కొనసాగించాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఏలూరు పడమరవీధి గంగానమ్మ మునిసిపల్ హై స్కూల్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు బోధిస్తున్న ప్రీ స్కూల్ ఆక్టివిటీస్ ను కలెక్టర్ పరిశీలించారు. పిల్లలతో ఇంగ్లీష్ లో పలు ప్రశ్నలు వేశారు. వాటికి ఆ చిన్న పిల్లలు చెప్పిన సమాధానాలకు కలెక్టర్ ముగ్దులయ్యారు. పిల్లలకు చక్కని శిక్షణ అందిస్తున్న అంగన్వాడీ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించడంతోపాటు, పిల్లలకు ప్రీ ప్రైమరీ స్కూల్ ఆక్టివిటీస్ కూడా పూర్తిగా నేర్పాలన్నారు. పిల్లలకు ఆటలు, పాటలు, మాటలు, చిన్న చిన్న పదాలు నేర్పడంతోపాటు పిల్లల్లో సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందించే విధంగా వివిధ కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. విద్య పట్ల పిల్లలకు చిన్నతనం నుండే ఆసక్తి కలిగే రీతిలో అంగన్వాడీ సిబ్బంది పనిచేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు తప్పనిసరిగా నిర్దేశించిన సమయాలను పాటించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోష్టికాహారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, ఐసిడిఎస్ పీడీ శారద, సిడిపిఓ ఏ.పద్మావతి, అంగన్వాడీ టీచర్ పద్మ,తహసీల్దార్ శేషగిరిరావు, ప్రభృతులు పాల్గొన్నారు.