టేబుల్ టెన్నిస్ దుస్తులను ఆవిష్కరించిన కలెక్టర్..
1 min readఫిజికల్ డైరెక్టర్లను అభినందించిన కలెక్టర్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఫెన్సింగ్ టేబుల్ టెన్నిస్ యస్జిఎఫ్ జట్టు జాతీయ జట్టు క్రీడా దుస్తులను కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయం నంద్యాలలో మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆవిష్కరించారు.ఈ నెల 17 నుండి 21 వరకు జమ్మూ కాశ్మీరు లో జరుగబోయే ఎస్.జి.ఎఫ్ అండర్-17 బాల బాలికల ఫెన్సింగ్ మరియు ఈ నెల 17 నుండి 21 వరకు సిల్వాస,డయ్యు డామన్ లో జరగబోయే అండర్-17 బాల బాలికల టేబుల్ టెన్నిస్ జాతీయ క్రీడలలో పాల్గొనే జట్టు క్రీడల దుస్తులను కలెక్టర్ మరియు డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు.నంద్యాల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీనాథ్ కలెక్టర్ వారి కార్యాలయంలో కలిసి జాతీయ క్రీడల యొక్క షెడ్యుల్ ను,ఎంపికైన క్రీడాకారుల వివరాలను,వారికి అందుతున్న సౌకర్యాలను వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఫెన్సింగ్ మరియు టేబుల్ టెన్నిస్ క్రీడలలో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టు క్రీడల్లో తమ సత్తా చాటి విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దేశస్థాయిలో పెంపొందించాలని కోరుతూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం అండర్-17 బాల బాలికల ఫెన్సింగ్ జట్టు కోచ్,మేనేజర్ లు గా వ్యవహరిస్తున్న నంద్యాల జిల్లా దీబగుంట్ల జడ్పీహెచ్ఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విశ్వనాథ్ ను, కర్నూలు జిల్లా ఆదోని వ్యాయామ ఉపాధ్యాయులు కళ్యాణ్ రావును అలాగే బాల బాలికల టేబుల్ టెన్నిస్ కోచ్, మేనేజర్లుగా వ్యవహరిస్తున్న లుదిమాను,నంద్యాల జిల్లా సంత జూటూరు రాజేష్ కుమార్ ను కలెక్టర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు భరత్ రెడ్డి,చంద్ర పాల్గొన్నారు.