రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పట్టణంలోని స్థానిక చదువుల రామయ్య భవనంలో శనివారం రక్తదానం శిబిరం ఏర్పాటు చేసినట్లు సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు మండల సహాయ కార్యదర్శి H. రంగన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 100 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సామాజిక సేవా దృక్పథంతో కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంలోనే పత్తికొండ పట్టణంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి చాలామంది అనారోగ్యంతో, ప్రమాదాలను ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చేరినప్పుడు రక్తం దొరక డబ్బులు పెట్టి కోనలేని నిరుపేద గర్భిణీ స్త్రీలకు రోడ్డు ప్రమాదంలో గయాపడిన వారికి సచ్చిన సహాయంగా ఉపయోగపడుతుందని వారు తెలిపారు. పెద్దలకు రక్తం దొరకక ప్రాణాలు పోతున్నాయి ఇలాంటి వారికి రక్తం దానం శిబిరాన్ని చాలా మంది కార్యక్రమాలలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థల వారు, సానుభూతిపరులు రక్తదాన శిబిరంలో పాల్గొని ఆపదలో ఉన్నవారికి ప్రాణదాతలుగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.