సత్పురుషుల సాంగత్యం జీవితానికి పరమార్ధం చేకూరుస్తుంది
1 min readడాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
యనకండ్ల గ్రామంలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సత్పురుషుల సాంగత్యం జీవితానికి సార్థకత చేకూరుస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బనగానపల్లె మండలం, యనకండ్ల గ్రామంలో వెలసిన శ్రీ కృష్ణ మందిరం నందు ఏర్పాటు చేసిన నాలుగు రోజుల కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా వారు ప్రారంభోపన్యాసం చేశారు. తదనంతరం బనగానపల్లెకు చెందిన ధార్మిక ప్రవచకులు జి.సుబ్బలక్ష్మమ్మ శ్రీమద్రామాయణంపై ప్రవచించారు. కార్యక్రమంలో సత్సంగ ప్రముఖ్ వడ్డే చిన్న శివన్న, అర్చకులు సానం బాలసుబ్బయ్య, పెండెకంటి శివరాముడు, సానం బాలతిమ్మయ్య, దాట్ల శ్రీరాములు, పెడకంటి వెంకటసుబ్బయ్య, పెండకంటి రామచంద్రుడు, మంటి బ్రహ్మయ్య, ఈడిగ కృష్ణయ్య గౌడ్, వడ్డే రామకృష్ణ, పైరెడ్డి రామ కృష్ణవేణమ్మ, పి.వెంకటసుబ్బమ్మ, జ్యోతి, గంగినేని శేషన్న, దాట్ల జానకి రాముడు, బాణాల రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.