ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే టవర్ నిర్మాణాన్ని తొలగించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: పట్టణంలో ఎయిర్టెల్ టవర్ నిర్మాణ అనుమతులను ఉపసంహరించుకోవాలిప్రజల అభిప్రాయం మేరకే అనుమతులు ఇవ్వాలి.బేతంచర్ల పట్టణంలోని డోన్ రోడ్డు రైల్వే గేటు సమీపంలో వే బ్రిడ్జి పక్కన ఎయిర్టెల్ నూతన టవర్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని సిపిఐ మండల కార్యదర్శి భార్గవ్ యన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉండే కాలనీ వాసులు సిపిఐ నాయకులను సంప్రదించడంతో అక్కడకు వెళ్లి నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా టవర్ నిర్మించడం సరైనది కాదని రేడియేషన్ ప్రభావం వలన మీ ప్రాంతంలో నివసించే ప్రజలు అనేక రకాలైన చర్మ వ్యాధులు మరియు సంతాన భాగ్యం లేకపోవడం అనేక రకాలైన అనారోగ్యాల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక మున్సిపల్ అధికారులు ఇష్టం వచ్చినట్లు అనుమతులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఏది ఏమైనా తక్షణమే టవర్ నిర్మాణ అనుమతులను ఉపసంహరించుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. గతంలో కాలనీవాసులు జగదీష్ టవర్ నిర్మాణ పనులను ఆపాలని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగిందని టవర్ నిర్మాణ పనులు అలాగే జరిగితే అడ్డుకుంటామని హెచ్చరించారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తక్షణమే స్పందించి కాలనీవాసులకు న్యాయం చేయాలని లేని పక్షంలో కాలనీవాసులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు స్థానిక కారునివాసులు మహిళలు వచ్చి నిర్మాణ పనులను అడ్డుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు.