PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూన్ 4న 8 గంటల నుండి  కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం

1 min read

పాణ్యం నియోజకవర్గ ఆర్వో/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: 138 పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ జూన్ 4 వ తేదీ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, ఉదయం 8.30 గంటల నుండి ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని పాణ్యం నియోజకవర్గ ఆర్వో/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు.శుక్రవారం కలెక్టరేట్ లోని మిని కాన్ఫరెన్స్ హాల్ లో  పాణ్యం నియోజకవర్గం కౌంటింగ్ ఏర్పాట్లపై మీడియా ప్రతినిధులతో పాణ్యం నియోజకవర్గం ఆర్వో/జాయింట్  కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ప్రెస్ కాన్ఫరెన్స్  నిర్వహించారు.పాణ్యం నియోజకవర్గం ఆర్వో/జాయింట్  కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024 లో భాగంగా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ రాయలసీమ యూనివర్సిటీలో ని మొదటి అంతస్తు ఇంజనీరింగ్ బ్లాక్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ కొరకు 14 టేబుల్స్ ని ఏర్పాటు చేయడమైందని, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి  దాదాపు 5700 పోస్టల్ బ్యాలెట్ లను 6 టేబుల్స్ ద్వారా రెండు రౌండ్లలో లెక్కించడం జరుగుతుందన్నారు. ప్రతి టేబుల్ కి ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ 26 రౌండ్లలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ సిబ్బందికి కౌంటింగ్ పై ఇప్పటికే రెండు పర్యాయాలు శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. కౌంటింగ్ సిబ్బంది ఏ టేబుల్ కు ఎవరిని కేటాయించామనే విషయం కౌంటింగ్ రోజు ఉదయమే ర్యాండమైజేషన్ ద్వారా  తెలియచేయడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఈవీఎంలకు సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్లు కూడా అందుబాటులో ఉంటారన్నారు. కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఈవీఎం యంత్రాలను కలెక్టరేట్లోని ఈవీఎం గోడౌన్స్ కు చేర్చడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ రోజున కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు ఇతర ఎన్నికల సిబ్బంది ఖచ్చితంగా ఐడెంటి కార్డులు  తీసుకొనేరావాలన్నారు.కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది ఎవరు కూడా కౌంటింగ్ హాల్ లోనికి మొబైల్ ఫోన్స్ తీసుకొని రాకూడదని, ఒకవేళ తీసుకుని వస్తే వాటిని మొబైల్ డిపాజిట్ సెంటర్లో  డిపాజిట్ చేసి కౌంటింగ్ హాల్ లోకి రావాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు.

About Author