PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కౌంటింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ పూర్తి

1 min read

జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జూన్ 4వ తేదిన కౌంటింగ్ సిబ్బంది విధులు నిర్వహించేందుకు గాను రెండవ ర్యాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన అబ్జర్వర్లకు వివరించారు.ఆదివారం కలెక్టరేట్ లోని ఎన్ఐసి కాన్ఫరెన్స్ హాల్లో జనరల్ అబ్జర్వర్లు జాఫర్, మీర్ తారిఖ్ అలీ సమక్షంలో కౌంటింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా ఈవిఎం, పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ కు అవసరమైన సిబ్బందితో పాటు అదనంగా 20 శాతం సిబ్బందిని రిజర్వ్ లో ఉంచుకునే విధంగా కౌంటింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ చేయడం జరిగిందన్నారు. అందులో ఈవిఎం టేబుల్ పై ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్, పోస్టల్ బ్యాలెట్ టేబుల్ పై ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్, ఒక మైక్రో అబ్జర్వర్, అబ్జర్వర్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉండేలా కౌంటింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి జనరల్ అబ్జర్వర్లకు వివరించారు. అనంతరం ర్యాండమైజేషన్ చేసిన కాపీల పై అబ్జర్వర్లు, జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి సంతకాలు చేసి అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.అంతకుముందు జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ ఏజెంట్లు ఏవైనా అవాంతరాలు కలిగిస్తే నియంత్రించడానికి ప్రతి ఫ్లోర్ లో సివిల్ డ్రెస్ లో మార్షల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఫైర్ సేఫ్టీ యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఫ్లోర్ ఎక్సీట్ ప్లాన్ తయారు చేయించాలని ఆర్ఓలకు సూచించారు. ప్రతి నియోజకవర్గం కౌంటింగ్ హాల్ దగ్గర మెడికల్ టీమ్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ తో రెడీగా ఉంచడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల జంక్షన్ వద్ద అంబులెన్స్, బెడ్స్ తో పాటు మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా మీడియా రూమ్, కమ్యూనికేషన్ రూమ్, కౌంటింగ్ రూమ్ల ఏర్పాట్లను అబ్జర్వర్లకు చూపించాలన్నారు. ఎన్కోర్ టీమ్ ను వారు నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ డేటాను అప్లోడ్ చేసే సమయంలోనే రౌండ్ వారీగా సమాచారాన్ని మీడియాకు షేర్ చేసేందుకు సమాచార శాఖ అధికారికి కూడా షేర్ చేయాలని ఆర్ఓలను అదేశించారు.కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ కౌంటింగ్ అబ్జర్వర్ బిపుల్ సైకియా, పాణ్యం రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, కర్నూలు రిటర్నింగ్ అధికారి/మున్సిపల్ కమీషనర్ భార్గవ తేజ, ఆదోని రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, పత్తికొండ ఆర్డీఓ/రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి, కోడుమూరు రిటర్నింగ్ అధికారి/ఆర్డీఓ శేషిరెడ్డి, ఎమ్మిగనూరు రిటర్నింగ్ అధికారి చిరంజీవి, ఆలూరు రిటర్నింగ్ అధికారి రామునాయక్, మంత్రాలయం రిటర్నింగ్ అధికారి విశ్వనాథ్, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు.

About Author