PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశ్వవేధ మహాగ్రంధం  సృష్టికర్తఒక్కడే.. తాడికొండశివాజీ

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ : విశ్వా వేద మహాగ్రంధం సృష్టికర్త ఒక్కడే అని రచయిత తాడికొండ శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ,కాదు అని ఎవరైనా నిరూపిస్తే లక్ష రూపాయల బహుమానం ఇవ్వబడును -అని ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవేధ మహా గ్రంథం  సర్వ సృష్టికి మూలాదారుడు ఒక్కడే అని ఈ పుస్తకం ప్రాముఖ్యతని తెలిపారు.మూలాధారుడైన సృష్టికర్త ఒక్కడు కాదని మరొకరు ఉన్నారని ఈ విశ్వ వేద మహా గ్రంధాన్ని కులంకషంగా పరిశీలించి  పరిశోధించి ఎవరైనా నిరూపిస్తే లక్ష రూపాయల బహుమానం ఇవ్వబడును అని తెలిపారు . ఇ గ్రంథం ఆవిష్కరణ  అనంతరం ఆరు నెలల  నుండి మూడు సంవత్సరాల లోగా భారతవేద విశ్వ పండితులైన, పురాణ పండితులైన,విశ్వవేధ మహా గ్రంధాన్ని పరిశీలించి నిరూపనకు సంసిద్ధులైతే తెలుగు భాష గ్రంథాల ఆధారంతో లేక సాంస్కృతిక తెలుగు అనునాధ గ్రంథాల ఆధారంతో నిరూపించగలిగితే  దృశ్యాలువాతో సత్కరించి  లక్ష రూపాయలు నగదు బహుమానంగా ఇచ్చి  ఘనంగా సత్కరించబడును. అని తెలిపారు. మూడు సంవత్సరాల లోగా భారతీయ వేద శాస్త్ర పండితులను నిరూపించలేని ఎడల తదుపరి ప్రపంచ వేద శాస్త్ర పండితులు పురాణ పండితులు వర్తింపజేయును .దయచేసి ఇది సవాలుగా భావించవద్దని సత్యయుగ ప్రవేశానికి నిజ నిర్ధారణ గ్రంథంగా భావించండి ,వాద ప్రతివాదలను చేయరాదని తెలిపారు.  జూలై 26వ తేదీన సాయంత్రం 5 గంటలకు మాకినేని బసవపునయ్య హాల్ లో ఈ పుస్తక ఆవిష్కరణ ఘనంగా నిర్వహిస్తున్నామని  అందరూ ఆహ్వానితులే అని ఒక ప్రకటనలో తెలిపారు.

About Author