మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరనిలోటు..
1 min readదేశానికి దారి చూపిన దార్శినికుడు మన్మోహనుడు..
మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి.
పల్లెవెలుగు వెబ్ ఆలూరు : కేంద్రంలో భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన వైఎస్ఆర్సిపి పార్టీ ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ పది సంవత్సరాల ప్రధానిగా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ధిశాలి అని, మూడు కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు 72 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ సింగ్ దని ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, ఆహార భద్రత చట్టం తీసుకొచ్చిన అపర మేధావి, తన ఆర్థిక సంస్కరణలతో దేశాన్నీ ముందు నడిపిన ధీరోదత్తుడు మాటల మనిషి కాదు చేతల్లో చేసి చూపిన చేతల మనిషి మన్మోహనుడని, స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణానికి నైతిక బాధ్యతగా తన ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడిన మహా మనిషని కోనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపిహొళగుంద మండలం కన్వీనర్ షఫీ ఉల్లా, ఎంపీటీసీ మళ్లీ, ఎస్కే గిరి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.