ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దు నిర్ణయం చారిత్రాత్మకం
1 min readకర్నూలు లో మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న న్యాయవాదులు…
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి,బాధ్యతలు చేపట్టిన మొదటి రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రజలకు, వారి ఆస్తులకు శ్రీరామరక్షగా నిలిచిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాశెట్టి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ మరియు కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. కర్నూలు జిల్లా కోర్టు ప్రాంగణంలో కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా లీగల్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాలలో న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీ కేఈ జగదీష్ కుమార్ మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజల పాలిట ఒక శాపంగా మారిన విషయం అందరికీ విదితమే, ఈ యాక్ట్ పై బార్ అసోసియేషన్ తో కలిసి ప్రజలలో చైతన్యం నింపుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయాలను వివరిస్తూ, దానివల్లే జరిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలనిఎన్నో కార్యక్రమాలు నిర్వహించమన్నారు. ఈ విషయంపై తమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మేము గతంలో తీసుకువచ్చినప్పుడు మన పార్టీ అధికారంలోకి రాగానే కచ్చితంగా రద్దు చేస్తామని హామీ ఇవ్వడం అయితే బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే ఈ యాక్టు ను రద్దు చేస్తూ సంతకం చేయడం హర్షించదగ్గ విషయం అని సంతోషం వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి కృష్ణమూర్తి మాట్లాడుతూశ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం మొదటి సంతకం మెగా డీఎస్సీ పై చేసి నిరుద్యోగులకు తాను అండగా ఉంటానని చెప్పిన మాటకు కట్టుబడుతూ మొదటి సంతకం చేయడం రాష్ట్రంలోని వర్గాల వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారన్నారు .రెండవ సంతకంగా అవ్వ తాతలకు మంజూరు చేస్తూ తన మాట నిలబెట్టుకున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవికాంత్ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి నాగముణి, లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్వీ ప్రసాద్ జనసేన లీగల్ సెల్ నాయకులు సి వి శ్రీనివాసులు, శ్రీ వాత్సవ, బిజెపి లీగల్ సేల్ నాయకులు మధుసూదన్ రెడ్డి, నరసింహులు, మనోహర్ రెడ్డి,నగర అధ్యక్షులు ఎస్ ఎ సుభాన్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వై జయరాజు, నాగభూషణం నాయుడు, రంగా రవికుమార్, సీనియర్ న్యాయవాదులు మురళి మనోహర్, మురళి మోహన్, శివ శంకర్ రెడ్డి, బి చంద్రుడు, హరి, కే నాగరాజు, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మాదన్న,గణేష్ సింగ్, హరినాథ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.