సంక్షేమ పథకాల రూపకర్త ఎన్టీఆర్…
1 min readఎన్టీఆర్ కు నివాళులు ఆర్పించిన టీడీపీ నాయకులు
167 మంది రక్తదానం చేశారు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలో సంక్షేమ పథకాల సృష్టికర్త, తరతరాలకు రాజకీయ చైతన్య స్ఫూర్తిగా నందమూరి తారక రామా రావు అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ప్రారంభించిన ఘనత ఆయనకే దక్కుతుందని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పాత తహసీల్దార్ కార్యా లయ ఆవరణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కూడు, గూడు, బట్ట నిరాదంతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల సంక్షేమానికి ఎనలేని పాటుపడ్డారన్నారు. పేదవారికి రేషన్ చేరుతుందంటే అది ఎన్టీఆర్ పుణ్యమేనని, పింఛన్, ఉచిత కరెంటుకు కేరఫ్ అడ్రెస్స్ గా ఎన్టీఆర్ నిలిచారన్నారు. ఈ రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, సీఎం చంద్రబాబు రాష్ట్రం మరింత ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల మరియు కే తిమ్మాపురం గ్రామీణ నాయకులు, సి ఉరుకుందు. బేతపల్లి రంగయ్య. కేటీ. వెంకటేష్. కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.