‘ కూటమి’తోనే.. రాష్ట్రం అభివృద్ధి..
1 min readఆరు నెలల కూటమి పాలన భేష్..
– కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు నిర్మిస్తోంది..
– విభజనలో భాగంగా ఏపీ ఆస్తులు, భవనాల పంపకానికి తెలంగాణ నాయకత్వం ముందుకు రావాలి
– దేవాలయాలపై దాడి చేసిన వారిని శిక్షించాలి
– రాజ్య సభ మాజీ సభ్యుడు టి.జి. వెంకటేష్
కర్నూలు, పల్లెవెలుగు:కూటమి ప్రభుత్వంతోనే… రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు రాజ్య సభ మాజీ సభ్యుడు టి.జి. వెంకటేష్. శుక్రవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఏపీ ఆర్థిక వ్యవస్థ సరిగా లేదని…. తెలంగాణాలో ఏపీ భవనాలు, ఆస్తులు పంపకానికి తెలంగాణ నాయకత్వం ముందుకు రావాలని కోరారు. తెలంగాణ ఆర్థికంగా వెనుకబడి ఉందన్న కారణంతో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల సీఎంలు అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టి … ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
దేవాలయాలపై…. దాడులు..
గత ఐదేళ్లలో ఏపీలోని పలు దేవాలయాలపై దాడులు జరిగాయని, దాడి చేసిందెవరో కూటమి ప్రభుత్వం విచారణ జరపాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆర్యవైశ్యులపై కూడా దాడులు జరుగుతున్నాయని, మా వాళ్లపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.
కర్నూలుకు హైకోర్టు బెంచ్…
రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలుకు హైకోర్టు బెంచ్ కావాలని పోరాడింది రాయలసీమ హక్కుల ఐక్యవేదిక అని ఆయన వెల్లడించారు. కొందరు న్యాయవాదులు రంగులు పూసుకొని మాట్లాడారు…అందుకే హై కోర్టు రాలేదని ఆరోపించారు.
బీజేపీలోకి..వైసీపీ నాయకులు
రాష్ట్రంలో వైసీపీ నాయకులు కొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తెలిపారు. చిరంజీవి బీజేపీలో చేరుతారన్న వార్తలలో వాస్తవం లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
మంత్రి టి.జి. భరత్ కృషితో..పరిశ్రమలు
కర్నూలులో పారిశ్రామిక విప్లవం వస్తుంది..మంత్రి టీజీ భరత్ కృషితో ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన మాజీ ఎంపీ టి.జి. వెంకటేష్ … ఏడు నెలల్లో పారిశ్రామికవేతలకు భరోసా ఇచ్చి… ఒప్పించడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు.