PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధి పనులు కల్పించడంలో జిల్లా వెనుకబడి ఉంది..

1 min read

అర్హులైన పేదలందరికీ  పనులు కల్పించాలి

200 శాతం లక్ష్యాలు పెట్టుకుని పని చేయాలి

వలసల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

అధికారులు గ్రామాలకు వెళ్లి ఏమి చేస్తే వలసలు నివారించగలమో తెలుసుకోవాలి

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఉపాధి పనులు కల్పించడంలో జిల్లా వెనుకబడి ఉంది..అర్హులైన పేదలందరికీ పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా డ్వామా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, ఉపాధి హామీ పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో  జిల్లా కలెక్టర్  సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధి హామీ పథకం అమలుపై లోతుగా సమీక్షించారు.. వలసల నివారణ దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు..కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు  పనులు కల్పించడం అన్నది చాలా ముఖ్యమైన అంశమని కలెక్టర్ పేర్కొన్నారు..ఉపాధి పనుల కల్పనలో జిల్లా  చాలా వెనుకబడి ఉందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబానికి సగటున ఉపాధి కల్పనలో  కర్నూలు జిల్లా 26.93 శాతంతో  25వ స్థానంలో ఉందని, అలాగే  పనిదినాలు కల్పించడంలో 99 శాతంతో  15 వ స్థానంలో ఉందని, రాయలసీమ ప్రాంతమైన కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పనులు కల్పించడంలో వెనుకబడి ఉంటే ఎలా అని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు..వలసలు వెళుతున్న ఆలూరు నియోజకవర్గం లోని హాలహర్వి, ఆస్పరి మండలాలతో పాటు  తుగ్గలి, కోడుమూరు, వెల్దుర్తి, కృష్ణగిరి,  నందవరం మండలాలలో కూడా  తక్కువ శాతం పనులు కల్పించారని కలెక్టర్ అధికారులను  ప్రశ్నించారు.  కృష్ణా జిల్లా లో 193, పార్వతీపురం మన్యం జిల్లాలో 164 శాతం పనులు కల్పిస్తే, ఎంతో అవసరం ఉన్న కర్నూలు జిల్లాలో 99 శాతం మాత్రమే కల్పించడమేంటి అని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. 200 శాతం ఉపాధి కల్పన దిశగా  లక్ష్యాలు పెట్టుకుని పని చేయాలన్నారు..ఏ పి డి లు గ్రామాలకు వెళ్లి, అన్ని గ్రామాల్లో పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే  జిల్లాలో ఇనాక్టివ్ గా ఉన్న లక్ష 50 వేల జాబ్ కార్డులు  ఏ కారణం చేత ఇనాక్టివ్ అయ్యాయో తెలుసుకోవాలని డ్వామా పిడి ని కలెక్టర్ ఆదేశించారు.వలసల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. వలసలు వెళుతున్న గ్రామాల్లో ఏ కార్యక్రమం చేస్తే రైతులకు, కూలీలకు లబ్ధి కలుగుతుంది, వలసలు వెళ్లే అవసరం లేకుండా చేయగలమో అధ్యయనం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  ఎన్ఆర్ఈజిఎస్ కింద గాని లేదా ఇతర జీవనోపాధుల కల్పన ద్వారా  కానీ వలసకి వెళ్లి సంపాదించిన మొత్తాన్ని ఇక్కడే సంపాదించే విధంగా ఏమి చేయగలం అని   ఏపిడి లు గ్రామాలకు వెళ్లి సర్వే చేపట్టి, ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు..వలసలు వెళ్లే ప్రతి మండలానికి ఒక ఇన్చార్జిని నియమించాలని కలెక్టర్ ఆదేశించారు.వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ సమీక్షలో భాగంగా వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ కింద  ప్లాంటేషన్ పనులే కాకుండా రైతులకు మరింత లాభసాటిగా ఉండే విధంగా పనులను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. ఉదాహరణకు కోస్తా జిల్లాలో  ప్రతి గ్రామంలో రెండు  చెరువులు ఉంటాయని ఒక చెరువు త్రాగునీటికి, మరొక చెరువును  రైతులు ఉపయోగించేందుకు ఉంటాయని, తద్వారా అక్కడ తాగునీటి సమస్యలు ఉండవన్నారు.  అలాగే మన జిల్లాలో కూడా  గ్రామాల్లో ఉన్న చెరువులకు కెనాల్ ద్వారా నీటిని నింపే విధంగా ఏమైనా  నీటి వనరులు ఉన్నాయా అని ఇరిగేషన్, ఆర్ డబ్ల్యు ఎస్, డ్వామా, వాటర్షెడ్ అధికారులు చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖల సమీక్షలో భాగంగా సంబంధించి 15వ ఫైనాన్స్ క మిషన్ 2023-24  లో  బడ్జెట్  వివరాలను  జిల్లా పంచాయతీ అధికారి ని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.. జిల్లాలో స్వామిత్వ సర్వే కి సంబంధించి ఎక్కడైనా ఏమైనా సమస్యలు  వచ్చాయా అని ఆదోని డివిజనల్ పంచాయతీ అధికారిని అడిగి తెలుసుకున్నారు.ఎల్ ఈ డి  లైట్స్ కి సంబంధించి ప్రతి గ్రామంలో  స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకునే పద్ధతిని అమలు చేయాలన్నారు. అదే విధంగా గ్రామాలలో అన్ని వీధి దీపాలు వర్కింగ్ కండిషన్ లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డి పి ఓ ను  ఆదేశించారు.ఏఎన్ఎమ్ లు నీటి నిల్వ ఉన్న ప్రదేశాలు, శానిటేషన్ సరిగ్గా లేని ప్రదేశాలను ఫోటోలు తీసి వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్ లో అప్లోడ్ చేసిన సమస్యలు పెండింగ్ లో లేకుండా పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది  త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిపిఓ ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రోడ్ల, భవన నిర్మాణాలు,ఇతర కార్యక్రమాల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కలెక్టర్ కు వివరించారు. వీటి పురోగతి, నిధుల వినియోగం గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.సమావేశంలో  డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, డిపిఓ నాగరాజు నాయుడు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఎస్ఈ రామ్మోహన్, డ్వామా ఏపిడి లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డీఈలు, తదితరులు పాల్గొన్నారు.

About Author